ABP  WhatsApp

Pilot Dies In Jet Crash: ఎయిర్‌ రేస్‌లో కుప్పకూలిన జెట్ విమానం- పైలట్ మృతి!

ABP Desam Updated at: 20 Sep 2022 02:20 PM (IST)
Edited By: Murali Krishna

Pilot Dies In Jet Crash: ఓ ఎయిర్‌ రేస్ షోలో పాల్గొన్న జెట్ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్ మృతి చెందాడు.

(Image Source: Twitter)

NEXT PREV

Pilot Dies In Jet Crash: అమెరికాలో ఓ ఎయిర్‌ రేస్ షోలో విషాదం జరిగింది. ఓ జెట్ విమానం అదుపు తప్పి నేలపై కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్ మృతి చెందాడు.


ఇదీ జరిగింది


నెవ‌డాలో జ‌రుగుతోన్న రీనో ఎయిర్ రేస్ షోలో ఈ ఘటన జరిగింది. ఫైనల్స్ కోసం పోటీపడిన ఓ జెట్ విమానం అదుపు త‌ప్పి నేలపై కుప్ప‌కూలింది. జెట్ కూలిన స‌మ‌యంలో భారీ స్థాయిలో మంట‌లు వ్యాపించాయి. విమాన భాగాలు చెల్లాచెదురుగా ప‌డిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో విడుదలైంది. 



రీనో ఎయిర్ రేస్‌లో భాగంగా చివ‌రి రోజు జ‌రుగుతున్న చాంపియ‌న్‌షిప్ రౌండ్‌లో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. జెట్ గోల్డ్ రేస్‌లోని మూడ‌వ ల్యాప్ జ‌రుగుతున్న‌ప్పుడు జెట్ కూలింది. ఈ ఘ‌ట‌న‌లో ఆ జెట్ విమాన పైల‌ట్ మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న త‌ర్వాత ఆ రేస్‌కు సంబంధించిన ఈవెంట్ల‌ను ర‌ద్దు చేశారు.


మరో ఘటన


ఈ నెల 14న పెషావర్‌ నుంచి దుబాయ్‌ వెళ్తున్న పాకిస్థాన్‌ విమానంలో సిబ్బందితో గొడవకు దిగాడు ఓ వ్యక్తి. నానా రచ్చ చేశాడు. విమాన సిబ్బందితో ఘర్షణకు దిగిన ఆ ప్రయాణికుడు కోపంతో సీట్లపై పిడిగుద్దులు కురిపించాడు. ఆ ప్రయాణికుడిని పాకిస్థాన్‌ ఎయిర్‌లైన్స్‌ బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. 







గాల్లో ప్రయాణిస్తున్న విమానం కిటికీలను కాళ్లతో తన్నాడు. వాటిని పగలగొట్టేందుకు యత్నించాడు. కింద బోర్లా పడుకున్నాడు. ఆ వ్యక్తి ప్రవర్తనతో విసిగిపోయాం. విమానయాన చ‌ట్టం ప్రకారం అతడిని సీటుకు కట్టేశాం. అనంతరం ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌కు సమాచారం అందించాం.                                                       -  విమాన సిబ్బంది


అనంతరం విమానం కెప్టెన్.. దుబాయ్ విమానాశ్రయంలో భద్రత ఏర్పాటు చేయాలని కోరారు. దుబాయ్‌లో విమానం దిగిన వెంటనే ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Also Read: Wall Collapses In Noida: నాలుగు రోజుల్లో రెండో ఘటన- గోడ కూలి నలుగురు మృతి


Also Read: Congress President Poll: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో థరూర్ VS గహ్లోత్- మరి రాహుల్ సంగతేంటి!

Published at: 20 Sep 2022 01:21 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.