Railway Track Viral Video: ముంబయిలో ఓ రైల్వే స్టేషన్‌లో లోకల్ ట్రైన్ ట్రాక్‌లపై కొందరు వంటావార్పులు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Mumbai Matters అనే అకౌంట్ నుంచి ఈ వీడియో పోస్ట్ అయింది. ఇంట్లో కూర్చుని తీరిగ్గా వంట చేస్తున్నట్టుగా...అసలేమీ పట్టకుండా అలా రైల్వే ట్రాక్‌పై వంటలు చేసుకున్నారు. ఈ వీడియో చూసిన వాళ్లంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో రైల్వే దృష్టికి వెళ్లింది. ముంబయి డివిజన్ రైల్వే మేనేజర్ వెంటనే స్పందించారు. ఈ వీడియోలో కొందరు మహిళలు ట్రాక్‌పై కూర్చుని వంట చేస్తున్నారు. కొంత మంది బాలికలు అక్కడే కూర్చుని చదువుకుంటున్నారు. కొంత మంది చిన్న పిల్లలు అక్కడే ఆడుతున్నారు. ఇంకొందరు ఆ ట్రాక్‌పైనే పడుకున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు "చాలా ప్రమాదకరం" అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వరుస పోస్ట్‌లు పెట్టారు. జనవరి 24వ తేదీన ఈ వీడియో పోస్ట్ అయింది. ఇప్పటికే ఈ వీడియోకి వేలాది వ్యూస్ వచ్చాయి. కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. "వీళ్లపై కఠిన చర్యలు తీసుకునేలా ఎవరైనా అధికారులకు లెటర్ రాయాలి" అని కొందరు సలహాలిచ్చారు. సెంట్రల్ రైల్వేస్ Divisional Railway Manager ముంబయి సెంట్రల్ వెస్టర్న్ రైల్వేస్‌ని ట్యాగ్ చేస్తూ చర్యలు తీసుకోవాలంటూ X వేదికగా పోస్ట్ పెట్టారు. RPF సిబ్బందీ తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
వందేభారత్ రైళ్లలో సర్వ్ చేస్తున్న ఫుడ్ చాలా దారుణంగా ఉంటోందంటూ ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. IRCTC ఇంత దారుణమైన ఫుడ్ పెడుతోందంటూ కొందరు ప్యాసింజర్స్ వీడియోలు తీసి పోస్ట్ చేశారు. న్యూ ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న వందేభారత్ రైల్లో చాలా నాసిరకమైన ఆహారాన్ని అందిస్తున్నారని ఓ ప్యాసింజర్ మండి పడ్డాడు. ఆకాశ్ అనే ఓ ప్రయాణికుడు కొన్ని వీడియోలు పోస్ట్ చేశాడు. ఈ ఫుడ్ మాకు అక్కర్లేదంటూ ప్రయాణికులు రిటర్న్ చేశారు. ఎలా ఉన్న ప్యాక్‌లను అలాగే తిరిగి ఇచ్చేస్తున్నారు. కూరలు పాచిపోయాయని, ఇలాంటి ఫుడ్ పెడతారా అంటూ ప్రశ్నించారు. ఇంత నాసిరకమైన ఆహారాన్ని ఎలా తింటామని మండి పడ్డారు. X వేదికగా ఈ పోస్ట్ పెట్టాడు ఓ ప్రయాణికుడు. ఈ పోస్ట్‌లో ఇండియన్ రైల్వేస్‌తో పాటు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అఫీషియల్ అకౌంట్స్‌నీ ట్యాగ్ చేశాడు.
Also Read: ఉత్తరాఖండ్‌లో త్వరలోనే యునిఫామ్ సివిల్ కోడ్! అమలుకి సిద్ధమవుతున్న ప్రభుత్వం