Bigg Boss Shobha Shetty: బిగ్ బాస్ సీజన్ 7లో అందరికంటే ఎక్కువగా ట్రోలింగ్‌కు కంటెస్టెంట్ శోభా శెట్టి. తనకు సపోర్ట్ చేసిన వారికంటే తనను విమర్శించిన వారే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. తను బిగ్ బాస్‌లో ఉన్నంతకాలం ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ అయిపోయి బయటికి వస్తుందా అని ఎదురుచూసిన వారు కూడా ఉన్నారు. ఫైనల్‌గా బిగ్ బాస్ జర్నీ ముగిసిపోయింది. అందుకే బయటికి వచ్చిన తర్వాత అప్పటి విషయాలు ఏమీ పట్టించుకోకుండా తన కెరీర్, పర్సనల్ లైఫ్‌లో బిజీ అయిపోయింది ఈ భామ. తాజాగా తన కల నెరవేరిందని చెప్తూ.. తన యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియోను అప్లోడ్ చేసింది శోభా శెట్టి.


యూట్యూబ్ ఛానెల్‌పై ఫోకస్..


శోభా శెట్టికి ఒక యూట్యూబ్ ఛానెల్ ఉందని తెలిసిన విషయమే. ఇక తను బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నంతకాలం ఈ ఛానెల్ సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు తన బిగ్ బాస్ ప్రయాణం ముగిసిపోవడంతో మళ్లీ యూట్యూబ్‌లో యాక్టివ్ అయ్యింది. తన రోజూవారీ షూటింగ్స్ గురించి, ఫోటోషూట్స్ గురించి మాత్రమే కాకుండా తన పర్సనల్ లైఫ్ గురించి కూడా వీడియోల ద్వారా బయటపెడుతుంది శోభా. తాజాగా తనకు, తన బాయ్‌ఫ్రెండ్ యశ్వంత్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవ్వగా.. అందులో వారి దుస్తులు, బ్యాక్‌గ్రౌండ్ చూసి ఇద్దరికీ ఎంగేజ్‌మెంట్ అయ్యిందనే వార్తలు వైరల్ అయ్యాయి. ఇంతలోనే వారిద్దరి కలిసి ఇల్లు తీసుకున్నట్టుగా తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా బయటపెట్టింది.


చాలాసార్లు మోసపోయాం..


చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల ఇప్పుడు సాకారమైందని తన సొంతింటి కల గురించి చెప్పుకొచ్చింది శోభా శెట్టి. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం రోజునే తన కొత్తింటి తాళంచెవి తన చేతికి వచ్చిందని తెలిపింది. ఇక రెండేళ్ల క్రితమే కన్‌స్ట్రక్షన్‌లో ఒక ఫ్లాట్‌కు అడ్వాన్స్ ఇచ్చామని.. కానీ పలు కారణాల వల్ల ఆ కన్‌స్ట్రక్షన్ ఆగిపోయిందని వాపోయింది. అంతే కాకుండా ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులు కూడా వెనక్కి ఇవ్వలేదని తెలిపింది. ఇలా చాలాసార్లు ఇంటి విషయంలో మోసపోయామని బయటపెట్టింది. రెండేళ్ల నుండి సొంతింటి కలను నిజం చేసుకోవడానికే కష్టపడుతున్నామని తెలిపింది. ఫైనల్‌గా కల నేరవేరిందని ఆనందం వ్యక్తం చేసింది.



బిగ్ బాస్ డబ్బుతో కాదు..


బిగ్ బాస్‌లో దాదాపు 14 వారాల వరకు కంటెస్టెంట్‌గా కొనసాగింది శోభా శెట్టి. దీంతో తనకు భారీగా రెమ్యునరేషన్ దక్కి ఉంటుందని టాక్ వైరల్ అయ్యింది. ఇక ఈ వీడియోలో దానిపై క్లారిటీ ఇస్తూ.. తనకు బిగ్ బాస్ వల్ల వచ్చిన డబ్బు నుండి ఇల్లు కొనలేదని చెప్పుకొచ్చింది. రెండేళ్ల క్రితమే దానిని కొన్నామని, అడ్వాన్స్ ఇచ్చామని తెలిపింది. కానీ అప్పటినుండి ఇప్పటివరకు ఇంటితాళం తన చేతికి రాలేదని, జనవరి 22నే వచ్చిందని చెప్పింది. 15వ అంతస్థులో తాము ఫ్లాట్ తీసుకున్నామని, ఇంటీరియర్ డిజైనింగ్‌కు ఇంకా టైమ్ పడుతుంది కాబట్టి అదంతా పూర్తయిన తర్వాత ఆ ఇంట్లోకి షిఫ్ట్ అవుతామని చెప్పింది శోభా శెట్టి. ఇక ఈ కొత్త ఫ్లాట్‌ను తీసుకోవడానికి వెళ్లిన వీడియోలో శోభా శెట్టితో పాటు తన బాయ్‌ఫ్రెండ్ యశ్వంత్, యశ్వంత్ తల్లిదండ్రులు కూడా ఉన్నారు.


Also Read: మాంత్రికుడిగా భయపెడుతున్న మాధవన్ - ఆసక్తికరంగా జ్యోతిక, అజయ్ దేవగన్ ‘సైతాన్’ టీజర్