Sharmila vs Jagan: ఏపీ(Andhra Pradesh)లో రాజకీయాలు సలసల మరుగుతున్న విషయం తెలిసిందే. వైసీపీ(YSRCP)ని టార్గెట్ చేసుకుని.. కాంగ్రెస్ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(PCC chief YS Sharmila) దూకుడుగా ముందుకు సాగుతున్నారు. తీవ్రమైన విమర్శలతో పాటు.. కుటుంబ వ్యవహారాలను కూడా. కుండబద్దలు కొట్టేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు కూడా చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే.. చివరికి అంతిమ లక్ష్యం ఓటు బ్యాంకును చీల్చడమే. వైసీపీకి అనుకూలంగా ఉన్న ఓటు బ్యాంకును తప్పించడమే. ఈ క్రమంలో ఆమె పదే పదే వైఎస్ పేరును ప్రస్తావిస్తున్నారు.
టార్గెట్ ఇదే..
ఈ లక్ష్యంతోనే కాంగ్రెస్(Congress party) తరఫున షర్మిల రంగంలోకి దిగారనేది వాస్తవం. ప్రధానంగా వైఎస్ రాజశేఖరరెడ్డి అనుకూల ఓటు బ్యాంకును కాంగ్రెస్ టార్గెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే.. షర్మిల పదే పదే వైఎస్ రాజన్న(YS Rajasekhara Reddy) పాలన ఇప్పుడు కనిపించడం లేదు. రాష్ట్రంలో అసలు పాలనే లేదు.. అని వ్యాఖ్యలు సంధిస్తున్నారు. అదేసమయంలో రాష్ట్ర ప్రజలకు, పరిశ్రమలకు.. వైఎస్ రాజశేఖరరెడ్డి.. వాచ్‌మన్(Watchman) లాగా పనిచేసి.. రక్షించారని.. ఇప్పుడు తాకట్టు పెట్టేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.
వైసీపీకి ఎఫెక్ట్ ఎంత?
ఈ వ్యాఖ్యల అంతరార్థం గమనిస్తే.... వైఎస్‌ను అభిమానించేవారిని.. ఆయన పాలనను కోరుకున్న మెజా రిటీ ప్రజలను ఆలోచనలో పడేసి.. వైసీపీ(YSRCP)కి దూరం చేయాలన్న ప్రధాన లక్ష్యం ఉంది. ఇదే కనుక కార్య రూపందాల్చితే.. వైసీపీకి షర్మిల ఎఫెక్ట్ తగులుతుందని అప్పుడే అంచనాలు కూడా వచ్చేస్తున్నాయి. సో.. ఇప్పుడు ఈ దిశగానే అధికార పార్టీ కూడా.. ఆలోచన చేస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ ఇవ్వాలని ప్రజల్లోకి వెళ్లాలని.. వైసీపీ నిర్ణయించుకుంది. తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajja Ramakrishna reddy) చేసిన ప్రసంగంలోనూ ఈ తరహా సంకేతాలు వచ్చాయి.
కాంగ్రెస్ దూతగా!
అయితే.. షర్మిల(YS Sharmila) చేసిన వ్యాఖ్యలతో ఏపీలో ప్రభావితం అయ్యే ఓటు బ్యాంకు ఎంత? అనేది చూస్తే.. పెద్దగా కనిపించడం లేదు. ఆమె వ్యక్తిగతంగా సొంత పార్టీ పెట్టుకుని వచ్చి ఉంటే.. ఆ ప్రభావం వేరేగా ఉండేది. కానీ, ఆమె వచ్చింది కాంగ్రెస్ దూత(Congress Ambasedor)గా.. నాయకురాలిగా.. ఏపీసీసీ చీఫ్‌గా. సో.. ఆమెను కాంగ్రెస్ నేతగానే చూస్తున్నారు.దీంతో కాంగ్రెస్‌పై ప్రజలు ఎలాంటి అభిప్రాయం ఉందో.. ఆమెపైనా అంతే ఉంటుంది. ఇక, వైఎస్ వేటికి కాపలాకాశారు? అనేది ఎవరూ పట్టించుకోవడంలేదనేది వాస్తవం. కానీ, ఆయన పెట్టిన కీలకమైన పథకాలు అమలవుతున్నాయా? లేదా? అనేది చూస్తున్నారు.
పథకాల పరిస్థితి ఇదీ..
వీటిలో ఆరోగ్య శ్రీ(Arogya Sri) పథకం అత్యంత కీలకం. అదేవిధంగా మహిళలకు ప్రోత్సాహం. ఇక,మరో ముఖ్యమైన అంశం మైనారిటీలకు ప్రాధాన్యం ఇవ్వడం. సామాజిక పింఛన్ల(Pentions)ను పెంచడం. వివాదరహితంగా పాలన సాగించడం.. ఈ విషయాలు మాత్రమే నగరం నుంచి పట్టణం వరకు.. ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వీటి ఆధారంగా వైసీపీ పాలనను అంచనా వేస్తే.. ఆయా పథకాలను సమగ్రంగా అమలు చేయడమే కాకుండా.. మరింత మెరుగులు దిద్దిన పరిస్థితి కనిపిస్తోంది. ఆరోగ్య శ్రీలో వైద్య సేవలు పెంచడమే కాకుండా.. దీని లిమిట్ ను ఏకంగా 25 లక్షలకు చేశారు.
కొంత వరకే పరిమితం?
ఇక, పింఛన్లను పెంచుతూ వెళ్లి.. ఇంటింటికీ అందిస్తున్నారు. వివాదాలు లేకుండా పాలన సాగిస్తున్నారు. సామాజిక వర్గాలకు, ముఖ్యంగా మైనారిటీ(Minorities)లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మహిళలకు అవకాశం కల్పిస్తున్నారు. ఇలా.. చూస్తే.. వైఎస్ పాలనలో ఉన్నవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి.. షర్మిల చీల్చే ఓటు బ్యాంకుపెద్దగా కనిపించడం లేదు. అయితే.. కొంత వరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది. అది ఏమేరకు అనేది కొంత సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.