Parvatmala Project: హిమాలయాల్లోని ఆలయాలను ఇక గాలిలో తేలుతూ చేరుకోవచ్చు.. దుర్గమమైన మార్గాల్లో గంటల కొద్దీ సాగే ప్రయాణాలకు ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. నిమిషాల్లోనే కొండ ప్రాంతాలకు చేరుకునేందుకు ఇప్పుడు తీగల దారలు వస్తున్నాయి. నేలమీద  భారీ రహదారులను నిర్మిస్తున్న National Highway Authority of India-NHAI ఇప్పుడు ఆకాశాన్ని తాకినట్లుండే కొండలపైన తీగల మార్గాలను నిర్మించనుంది. రెండేళ్ల క్రితం ప్రకటించిన పర్వతమాల పరియోజనలో  ఫథకంలో భాగంగా ఉత్తరాఖండ్‌లో చేపట్టబోయే  రెండు ప్రాజెక్టులకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) "నేషనల్ రోప్‌వేస్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్  కు అనుమతులు ఇచ్చింది. గోవిందఘాట్ – హేమ్‌కుండ్ సాహిబ్ జీ రోప్‌వే (12.4 కిమీ) – ₹2,730.13 కోట్లు, సోన్ప్రయాగ – కేదార్‌నాథ్ రోప్‌వే (12.9 కిమీ) – ₹4,081.28 కోట్లులకు అనుమతులు వచ్చాయి. ఈ రెండు ప్రాజెక్టులు Design, Build, Finance, Operate, and Transfer (DBFOT) మోడల్ లో పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) ప్రాతిపదికన అభివృద్ధి చేస్తారు.


ఏంటీ పర్వతమాల పరియోజన..?


మన దేశంలో దాదాపు ౩౦ శాతం భూభూగంలో కొండలు, పర్వతాలున్నాయి. జమ్మూకాశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్‌తోపాటు.. ఈశాన్య రాష్ట్రాలు మొత్తం పర్వతాలు, లోయలతోనే నిండి ఉన్నాయి. ఇక్కడ రోడ్లు వేయడం కూడా కష్టంతో కూడుకున్న పని. ఇలాంటి చోట్లలో కూడా చివరి మైల్ వరకూ కనెక్టివిటీ ఇవ్వాలన్న తలంపుతోనే ఈ ప్రాజెక్టును 2022 బడ్జెట్‌లో ప్రకటించారు.  హిమాలయాల్లో చాలా వరకూ పవిత్రమైన ధామాలున్నాయి. హిందువులు ఎక్కువుగా దర్శించుకునే ఆలయాలతో బౌద్ధుల Monestryలు ఇక్కడ ఉండటంతో పెద్ద ఎత్తున పర్యాటకులు వెళుతుంటారు. రైలు, వైమానిక మార్గాలు పరిమితంగా ఉండటంతో పాటు, రహదారి నిర్మాణానికి సాంకేతిక సమస్యలు ఉన్నాయి అయితే రోడ్లు చాలా చిన్నగా ఉండటంతో మోటార్ ట్రాన్స్‌పోర్ట్ లేక పెద్ద వయసు వారు ఇబ్బంది పడతారు. ఇలాంటి పరిస్థితుల్లో రోప్‌వేలు వేయడం సురక్షితమైన మార్గంగా గుర్తించారు. అలా తెరపైకి వచ్చిందే పర్వతమాల ప్రాజెక్టు. National Highway Logistics Management Limited (NHLML)కు ఈ ప్రాజెక్టు కార్యాచరణ అప్పగించారు.  5 సంవత్సరాలలో 1,200 కిమీ విస్తీర్ణంలో 250 రోప్‌వే ప్రాజెక్టుల అభివృద్ధి చేయాలన్నది దీని లక్ష్యం.


 


రోప్‌ వేతో లాభాలు



  • రోప్‌వే నిర్మాణానికి హైవేలతో పోలిస్తే ఖర్చు ఎక్కువే అయినప్పటికీ.. దీనిలో భూ సేకరణ తక్కువ. నిర్వహణ ఖర్చులు కూడా తక్కువే

  • రోడ్డు రవాణాతో పోలిస్తే చాలా వేగంగా చేరుకునే అవకాశం ఉంటుంది.

  • వాహనాలు లేకపోవడం వల్ల తక్కువ శబ్ద కాలుష్యం, గాలి కాలుష్యం ఉండవ్.

  • ఈ ప్రాజెక్టుల ద్వారా ఏటా 50వేల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చు.

  • ఇబ్బందికరమైన చివరి ప్రాంతాలకూ చేరుకోవచ్చు. కేవలం ప్రయాణికులను మాత్రమే కాదు.. మెటీరియల్ చేరవేయడానికి కూడా వీలుంటుంది. ఇవన్నీ ఎలివేటెడ్ కారిడార్లు కాబట్టి..  రవాణాకు ఇబ్బంది లేదు. అదే రోడ్డు మార్గమైతే ఘాట్ రోడ్ల ఏర్పాటుతో పాటు భారీ సొరంగాలు కూడా తవ్వాల్సి వచ్చేది.

  • ఇక ఈ ప్రాజెక్టుతో కలిగే అతిపెద్ద బెనిఫిట్ ఉద్యోగ అవకాశాలు. వచ్చే పదేళ్లలో జరిగే పనులవల్ల 85లక్షల పనిదినాలు  కల్పించవచ్చని అంచనా.. ఇక ఆ తర్వాత రోప్‌వేలు సిద్దమైతే వాటి నిర్వహణకు కోటి పనిదినాలు కల్పించవచ్చు. కేవలం నిర్మాణంలోనే కాదు.. ఈ ప్రాజెక్టు ద్వారా టూరిజం, హాస్పిటాలిటీ, ట్రాన్స్ పోర్ట్ రంగాల్లో అవకాశాలు, ఉద్యోగాలు పెరుగుతాయి


 


నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు


కేదార్నాథ్ రోప్‌వే ప్రాజెక్ట్ లోని సోనప్రయాగ – కేదార్నాథ్ రోప్‌వే (12.9 కిమీ) పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇది ప్రపంచంలోని అతిపెద్ద రోప్‌వేలలో ఒకటి. దీనికోసం  ₹4,081.28 కోట్లు ఖర్చు చేయనున్నారు.  గంటకు 1,800 ప్రయాణికులు ఒకవైపు ప్రయాణం చేయగలుగుతారు. రోజుకు 18వేల మందికి ప్రయాణం కల్పించొచ్చని అంచనా. 8-9 గంటల ప్రయాణాన్ని కేవలం 36 నిమిషాలకు తగ్గించొచ్చు.




హేమ్‌కుండ్ సాహిబ్ రోప్‌వే ప్రాజెక్ట్  గోవిందఘాట్ – హేమ్‌కుండ్ సాహిబ్ జీ (12.4 కిమీ) వరకూ ఉంటుంది. దీనికి  ₹2,730.13 కోట్లు ఖర్చు చేయనున్నారు.  దీనిలో గంటకు 1,100 ప్రయాణికులు రోజుకు 11,000 మందిని రవాణా చేయొచ్చు.  15,000 అడుగుల ఎత్తులో ఉన్న హేమ్‌కుండ్ సాహిబ్ కు  లక్షలాదిగా పర్యాటకులు వస్తుంటారు. వచ్చేవారిలో2 లక్షల మంది యాత్రికులకు సులభంగా అందుబాటులోకి రానుంది.


వరణాసి అర్బన్ రోప్‌వే ఇండియాలో తొలి పట్టణ రోప్‌వే ప్రాజెక్ట్  ఇది షుమారు 4కిలోమీటర్లు ఉంటుంది. వారణాశిలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ప్రత్యామ్నాయంగా దీనిని తీసుకొచ్చారు.  ప్రధాని మోదీ కిందటేడాది శంకుస్థాపన చేశారు. పనులు వేగంగా జరుగుతున్నాయి.


 


రాబోయే ప్రాజెక్టులు


2024-25లో 60కిలోమీటర్ల ప్రాజెక్టులను అవార్డ్ చేయాలని నిర్ణయించారు. దేశంలోని ప్రముఖ ఆలయాల వద్ద ఈ ప్రాజెక్టులు రాబోతున్నాయి.  ఇందుకోసం యుపి, జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సామ్, మహరాష్ట్ర వంటి 13 రాష్ట్రాలతో కేంద్రం ఒప్పందం చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని మహాకాళేశ్వర్ రోప్‌వేకు అవార్డ్ జారీ చేశారు. సంగం ప్రయాగరాజ్, జమ్మూ కశ్మీర్ లోని ఆది శంకరాచార్య ఆలయం కు బిడ్డర్లను ఎంపిక చేశారు. ఇక కేదారనాథ్, హేమకుండ్ సాహిబ్‌, వారణాశి ప్రాజెక్టులతో పాటు.. అస్సాంలోని ఖామాక్య టెంపుల్, అరుణాచల్ ప్రదేశ్ టవాంగ్ Monasterym ఉత్తరాఖండ్‌లోని హనుమాన్ గర్హీ, మహరాష్ట్రలోని బ్రహ్మగిరి ప్రాజెక్టులకు ఇప్పటికే బిడ్డర్లను ఆహ్వానించారు.


 వచ్చే పదేళ్లలో 40వేల కోట్లు దీనికోసం ఖర్చు చేయనున్నారు. ఈ రోప్‌వే పరికరాల్లో కనీసం 50శాతం మేక్‌ఇన్ ఇండియా కార్యక్రమం కింద భారత్‌లోనే తయారు చేయనున్నారు. వచ్చే పదేళ్లలో భారత్‌ GDPకి ఈ ప్రాజెక్టు ౩౦బిలియన్ డాలర్లను సమకూరుస్తుందని అంచనా..