Budget Session: 


మధ్యాహ్నానికి వాయిదా..


పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడ్డాయి. రెండు సభలనూ మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా వేశారు. అదానీ గ్రూప్‌ అవకతకవకలపై హిండన్‌బర్గ్ ఇచ్చిన రిపోర్ట్‌పై చర్చ జరపాలన్న ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. LIC పరిస్థితేంటి అంటూ నినదించాయి. ఈ గందరగోళం మధ్య సభ నడపలేక వాయిదా వేశారు. అదానీ అంశంతో పాటు ప్రతిపక్షాలు సరిహద్దులో చైనా ఆక్రమణలపైనా కేంద్రం నోరు విప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే  బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగే అవకాశాలు కనిపించడం లేదు. అటు ప్రతిపక్ష పార్టీలు అదానీ అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నాయి. దీనిపై ఓపెన్ డిస్కషన్ పెట్టాల్సిందేనని పట్టు పడుతున్నాయి. ఆమ్‌ఆద్మీ పార్టీ అయితే...జాయింట్ పార్లమెంటరీ ప్యానెల్‌ను నియమించి అదానీ అంశాన్ని విచారించాలని డిమాండ్ చేస్తోంది. ఇంత జరుగుతున్నా...ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు పెదవి విప్పడం లేదో చెప్పాలని మండి పడుతోంది ఆప్. ఎంతో మంది ప్రజలు LICలో పెట్టుబడులు పెట్టారని ఇప్పుడు వాళ్లకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తోంది. సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని విచారించాలనీ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 


"దేశంలో జరుగుతున్న అన్ని స్కామ్‌లపైనా ఓపెన్ డిస్కషన్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. జాయింట్ పార్లమెంటరీ కమిటీని నియమించాలి. లేదంటే సుప్రీంకోర్టు నేతృత్వంలోనే ఓ ప్యానెల్‌ను అయినా నియమించివిచారణ జరిపించాలి" 


మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు 
  
రాజ్యసభలోని దాదాపు అందరు ప్రతిపక్ష ఎంపీలు పలు అంశాలపై చర్చించేందుకు రాజ్యసభ ఛైర్మన్‌కు నోటీసులు ఇచ్చారు. అయితే.. ఛైర్మన్ వీటిని తిరస్కరించారు. రూల్స్ ప్రకారం లేవని వెల్లడించారు. ఫలితంగా...ఒక్కసారిగారెండు సభల్లోనూ అలజడి మొదలైంది. 


Also Read: Adhir Ranjan Chowdhury: మన జేబులో నుంచి లాక్కుంది ఎక్కువ, ఇచ్చింది మాత్రం తక్కువ - కేంద్ర బడ్జెట్‌పై అధిర్ రంజన్ సెటైర్