Pandit Shivkumar Sharma Death: సుప్రసిద్ధ సంతూర్ విద్వాంసుడు, సంగీత దర్శకుడు పండిట్ శివ కుమార్ శర్మ కన్నుమూశారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయనకు గుండె పోటు రావడంతో ముంబయిలో ఆకస్మికంగా మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. 

Continues below advertisement


84 ఏళ్లు


పండిట్ శివ కుమార్ శర్మ దేశంలోనే అత్యంత సుప్రసిద్ధులైన సంప్రదాయ సంగీతకారుల్లో ఒకరు. ఆయన వయసు 84 సంవత్సరాలు. మంగళవారం ఉదయం ఆయనకు తీవ్ర గుండె పోటు వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు నిత్యం డయాలసిస్ జరుగుతూ ఉండేదన్నారు.


ప్రొఫైల్ 



  • పండిట్ శివ కుమార్ శర్మ 1938లో కశ్మీరులో జన్మించారు.

  • జమ్మూ-కశ్మీరులోని జానపద వాద్య పరికరం సంతూర్‌ను ఉపయోగించి భారతీయ సంప్రదాయ సంగీతాన్ని వినిపించిన మొట్టమొదటి సంగీతకారుడు ఆయనే. 

  • పండిట్ శివ కుమార్ శర్మ సుప్రసిద్ధ వేణు నాద సంగీతకారుడు పండిట్ హరి ప్రసాద్ చౌరాసియా తో కలిసి సిల్సిలా, లమ్హే, చాందిని వంటి సినిమాలకు సంగీతాన్ని సమకూర్చారు.

  • భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో ఆయనను సత్కరించింది.


  • ఆయన కుమారుడు రాహుల్‌ శర్మ కూడా సంతూర్ విద్వాంసుడే. కుమారుడే తన ప్రియ శిష్యుడని, తనకు దేవుడిచ్చిన వరమని గతంలో చాలా ఇంటర్వ్యూల్లో శివకుమార్‌ చెప్పారు. 




మోదీ సంతాపం


శివకుమార్‌ శర్మ మృతి పట్ల భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి సంగీత ప్రపంచానికే తీరని లోటని ప్రధాని మోదీ అన్నారు.










Also Read: SC on Sedition Law: రాజద్రోహం కేసులపై కేంద్రానికి సుప్రీం 24 గంటల డెడ్‌లైన్


Also Read: Bangkok News: 21 ఏళ్లుగా భార్య శవంతో సహజీవనం- చివరికి ఏం చేశాడంటే?