Imran Khan Bail: 


యాంటీ టెర్రర్ కోర్టులో హాజరు కావాల్సిందే..


పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను అరెస్ట్ చేస్తారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో...ఇస్లామాబాద్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఇమ్రాన్‌కు ఆగస్టు 25వ తేదీ వరకూ ప్రొటెక్టివ్ బెయిల్‌ను (Protective Bail) మంజూరు చేసింది. ఆగస్టు 25వ లోపు యాంటీ టెర్రర్ కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. తనను అరెస్ట్ చేస్తారన్న ముందుస్తు సమాచారంతో ఇమ్రాన్ ఖాన్‌...ఇస్లామాబాద్ హైకోర్టుని ఆశ్రయించారు. ప్రీ అరెస్ట్ బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇందుకు అనుగుణంగా కోర్టు తీర్పునిచ్చింది. ఇమ్రాన్ తరపున న్యాయవాదులు బాబర్ అవన్, ఫైజల్ చౌదరి..."కావాలనే ఇమ్రాన్‌ను ప్రభుత్వం టార్గెట్ చేసింది. భయం లేకుండా విమర్శలు చేస్తుండటమే ఇందుకు కారణం. అవినీతి రాజకీయాలపై గొంతెత్తడం వల్లే ఇదంతా" అని చెప్పారు. "ఇమ్రాన్‌పై నిరాధారమైన కేసులు నమోదు చేశారు. ఆరోపిస్తున్నారు. ఇస్లామాబాద్ క్యాపిటల్ టెరిటరీ (ITC) పోలీసులు అనవసరంగా కేసు నమోదు చేశారు" అని ఇమ్రాన్ లాయర్స్ విమర్శిస్తున్నారు. ఇమ్రాన్‌ను అరెస్ట్ చేయాలనుకుంటున్న ప్రభుత్వం..హద్దులు దాటి ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. 


ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు..


ఇమ్రాన్ ఖాన్‌ను ఇటీవల ఓ పబ్లిక్ ర్యాలీలో ప్రభుత్వ సంస్థలకు, పోలీసులకు, చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడారు. అప్పటి నుంచిఆయనను టార్గెట్ చేసింది ప్రభుత్వం. యాంటీ టెర్రర్ యాక్ట్ కింద ఆయనను అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే పీటీఐ పార్టీ నేతలు ఈ నిర్ణయంపై తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఒకవేళ ఇమ్రాన్‌ను అరెస్ట్ చేస్తే..రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టాలని ఆ నేతలు భావిస్తున్నట్టు కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. ఇస్లామాబాద్‌లో జరిగిన సభలో ఇమ్రాన్ ఖాన్...ఓ మహిళా మెజిస్ట్రేట్ సహా...పోలీసులు, ఎన్నికల సంఘం, రాజతీయ ప్రత్యర్థులపై కేసులు పెడతానంటూ హెచ్చరికలు చేశారు. దీనిపై ఓ మెజిస్ట్రేట్ ఆయనపై కేసు నమోదు చేశారు. విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారంటూ విమర్శించారు. ప్రస్తుతానికి ఆయన ప్రసంగాలపై నిషేధం విధించారు. ఒకటికి రెండు సార్లు ఎడిట్ చేయకుండా ఇమ్రాన్ ప్రసంగాలను టెలికాస్ట్ చేయొద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ క్రమంలోనే ఆయనను అరెస్ట్ చేస్తారంటూ వార్తలు రావటంపై ఆ పార్టీ అప్రమత్తమైంది. పీటీఐ సీనియర్ నేత ఫవాద్ చౌదరి పార్టీ నేతలతో మాట్లాడారు.  ఇమ్రాన్ నివాసమైన బని గలా రెసిడెన్సీకి కార్యకర్తలు రావాలని పిలుపునిచ్చారు. ఆ మేరకు...పార్టీ నేతలు ఇమ్రాన్ ఇంటికి వరుస కట్టారు. అవాంఛిత సంఘటనలేమీ జరగకుండా పోలీసులు నిఘా ఉంచారు. 


హౌజ్ అరెస్ట్ అవకాశముందా..? 


ఇమ్రాన్ ఖాన్‌ను హౌస్ అరెస్ట్ చేసే అవకాశముందని తెలుస్తోంది. హై కమాండ్ ఆదేశాలు అందగానే...ఆయనను అరెస్ట్ చేస్తారని చెబుతున్నారు. ప్రస్తుతానికి ఇమ్రాన్..తన పార్టీ నేతలతో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఒకవేళ తనను అరెస్ట్ చేస్తే...నెక్స్ట్ ఏం చేయాలో నేతలకు సూచనలు చేస్తున్నట్టు సమాచారం. అటు పోలీసులు...ఇమ్రాన్ ఇంటి పరిసరాల్లో పహారా కాస్తున్నారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడకుండా చర్యలు చేపడుతున్నారు. కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. పాకిస్థాన్‌లో ఎన్నికల విషయంలోనూ గతంలో ఎన్నో సార్లు మాట్లాడారు...ఇమ్రాన్ ఖాన్. ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పాకిస్థాన్‌లో ప్రస్తుత రాజకీయ సంక్షోభానికి తెరపడాలంటే ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.


Also Read: దిల్లీ స్కాం ఆరోపణలపై కవిత న్యాయపోరాటం- బీజేపీ నాయకులపై పరువు నష్టం దావా !


Also Read: Why Amit Shah Met NTR : బీజేపీ హిందుత్వ ఎజెండాకు ఎన్టీఆర్ ఓకే చెబుతారా? - రజాకార్ ఫైల్స్‌లో తారక్?