Pakistan Blast: 


24 గంటల వ్యవధిలో రెండు పేలుళ్లు


పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ఓ ఫుట్‌బాల్ స్టేడియం వెలుపల బాంబు పేలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఓ పోలీస్ కూడా ఉన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో స్టేడియంలో ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. ఎయిర్‌ పోర్ట్ రోడ్‌లోని క్వెట్టా ప్రావిన్స్‌కు సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. పాకిస్థాన్‌ పారామిలిటరీ ఫోర్స్‌గా పరిగణించే ఫ్రంటియర్ కార్ప్స్‌ ఈ మ్యాచ్‌ను ఆర్గనైజ్ చేశారు. మ్యాచ్ జరుగుతుండగానే బాంబు పేలటం వల్ల అందరూ భయాందోళనకు గురయ్యారు. ప్రేక్షకులు ఒక్కసారిగా స్టేడియం ఖాళీ చేసి బయటకు వెళ్లిపోయారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వాళ్లకు ప్రాణాపాయం తప్పిందని పీటీఐ పేర్కొంది. ప్లేయర్స్ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఉన్నతాధికారులు తెలిపారు. స్టేడియంలోని పార్కింగ్ ఏరియాలో బైక్‌లో బాంబు పెట్టారని, రిమోట్‌తో ఆపరేట్ చేసి పేల్చారని ప్రాథమికంగా నిర్ధరించారు. ఈ పేలుడు ధాటికి చుట్టు పక్కల ఉన్న బైక్‌లు కూడా ధ్వంసమయ్యాయి. కాబూల్‌ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో T20 లీగ్ జరుగుతుండగానే గ్రెనేడ్ బ్లాస్ట్ జరిగింది. ఆ ఘటనలో ఇద్దరు పౌరులు మృతి చెందారు. ఈ పేలుడు జరిగిన 24 గంటల వ్యవధిలోనే బలూచిస్థాన్‌లో బ్లాస్ట్ జరిగింది.









 


భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని..


స్టేడియంనే టార్గెట్ చేసుకోవటం వెనక కారణాలను అంచనా వేస్తున్నారు పోలీసులు. భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకునే ఈ దాడులు చేస్తున్నారా అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. ఇప్పటి వరకైతే ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఇది తమ పనే అని ప్రకటన చేయలేదు. కాబుల్‌లో తాలిబన్ల ఆధిపత్యం మొదలైనప్పటి నుంచి సెక్యూరిటీ సిబ్బందిపై ఇలాంటి దాడులు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. తెహ్రీక్ ఇ తాలిబన్ లాంటి నిషేధిత ఉగ్ర సంస్థలు అఫ్గానిస్థాన్-పాక్ బార్డర్‌లో ఇంకా యాక్టివ్‌గానే ఉన్నట్టు నిఘా వర్గాల సమాచారం. జులై 27వ తేదీన పాకిస్థాన్‌లోని ఖైబర్ పంక్తుఖ్వా ప్రావిన్స్‌లో దాడులు జరగ్గా, ముగ్గురు పోలీసులు మృతి చెందారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.  


Also Read: IND-W vs PAK-W T20: భారత్ vs పాక్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం, టాస్ ఆలస్యం - అసలు జరిగే ఛాన్స్ ఉందా !


Also Read: Police Vs Politicians : పోలీసులు వర్సెస్ పొలిటిషియన్స్, వివాదాస్పదం అవుతున్న నేతల తీరు!