Pakistan Woman:
పబ్‌జీ పరిచయంతో..
పబ్‌జీలో పరిచయమైన యువకు కోసం పాకిస్థాన్ దాటి భారత్‌కి వచ్చింది ఓ మహిళ. భర్తను వదిలేసి నలుగురు పిల్లలతో ఇండియాకి వచ్చి ఆ కుర్రాడితో కాపురం పెట్టింది. పోలీసులు ఆమె ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ఇంతలోనే ఆమె భర్త ఓ వీడియో విడుదల చేశాడు. తన భార్యని సేఫ్‌గా పాకిస్థాన్‌కి పంపేయాలని వేడుకున్నాడు. సౌదీలో ఉంటున్న ఆమె భర్త ఓ వీడియోతో ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశాడు.
"నరేంద్ర మోదీ ప్రభుత్వానికి నాదో విజ్ఞప్తి. దయచేసి మా ఆవిడని, పిల్లలను పాకిస్థాన్‌కి పంపేయండి. వాళ్ల ఇంటికి సురక్షితంగా చేర్చండి. నా భార్యను ఎవరో ట్రాప్ చేశారు. కావాలనే పరిచయం పెంచుకుని ఇండియాకి రప్పించారు. ఇండియన్ మీడియా నాకు చాలా సపోర్ట్ చేస్తుంది. ఇది నేను ఊహించలేదు. వాళ్ల వల్లే నా భార్య ఎక్కడుందో తెలిసింది. మోదీజీ...చేతులు జోడించి వేడుకుంటున్నాను. మా కుటుంబాన్ని కలపండి"
- గులామ్ హైదర్
ఇదీ కథ..
పబ్‌జీ (PUBG) ద్వారా పరిచయమైన నోయిడా కుర్రాడితో ప్రేమలో పడింది పాకిస్థాన్ మహిళ. అప్పటికే ఆమెకి పెళ్లై నలుగురు పిల్లలున్నారు. అయినా...ఆ కుర్రాడే కావాలని పట్టు పట్టింది. ఎలాగైనా అతనితోనే కలిసి బతకాలని నిర్ణయించుకుంది. నలుగురు పిల్లలతో పాటు బార్డర్ దాటి మరీ గ్రేటర్ నోయిడాకి వచ్చింది. అక్కడే ఓ ఏరియాలో ఇల్లు అద్దెకు తీసుకుని ఇద్దరూ చాలా రోజులుగా కలిసి ఉంటున్నారు. నేపాల్ మీదుగా ఆ మహిళ ఇండియాకు వచ్చింది. ఇద్దరికీ పెళ్లైందని అబద్ధం చెప్పి ఇల్లు రెంట్‌కి తీసుకున్నారు. రహస్యం బయట పడగానే అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఏడాది మే నెలలో ఆ మహిళ ఇండియాకి వచ్చినట్టు తెలుస్తోంది. రబూపురకు చెందిన సచిన్‌తో పబ్‌జీకి అడిక్ట్ అయ్యాడు. అలా ఆడే క్రమంలోనే పాకిస్థాన్ మహిళతో పరిచయమైంది. తరచూ మాట్లాడుకునే వాళ్లు. ఆ చనువు కాస్తా ప్రేమగా మారింది. "నువ్వు లేక నేను లేను" అనే రేంజ్‌లో ప్రేమలో కూరుకుపోయారు. మే 13న ఆ పాకిస్థాన్ మహిళ ఇల్లు వదిలి వచ్చేయాలని ఫిక్స్ అయింది. అనుకున్న వెంటనే నలుగురు పిల్లల్ని తీసుకుని బార్డర్ దాటి ఇండియాకు వచ్చేసింది. గ్రేటర్ నోయిడాలోనే సచిన్‌తో పాటు కొన్నాళ్లుగా సహజీవనం చేస్తోంది. ఈ విషయం బయటపడడం వల్ల పరారయ్యారు. ఆ తరవాత వాళ్లిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు సంస్థలూ ఈ కేసుని టేకప్ చేశాయి. ఆ మహిళ పేరు సీమ గులాం హైదర్‌గా గుర్తించారు. పబ్‌జీ ద్వారా సచిన్‌తో పరిచయమైందని ఆమె పోలీసులకు చెప్పింది. మూడు టీమ్స్ వాళ్ల కోసం గాలించాయి. CCTV ఫుటేజ్‌లు పరిశీలించాయి. మొత్తానికి ఆ మహిళ పోలీసుల కంట పడింది. పబ్‌జీని ఇండియాలో కొన్నాళ్ల పాటు బ్యాన్ చేశారు. ఈ మధ్యే మళ్లీ అందుబాటులోకి వచ్చింది. వెంటనే ఈ ఘటన అందరికీ షాక్ ఇచ్చింది.
Also Read: నేనింకా ముసలివాడిని కాలేదు, పని చేసే శక్తి ఉంది - శరద్ పవార్ కౌంటర్