సెల్ ఫోన్లు మార్చేసినట్లుగా సిమ్‌కార్డులను కూడా మార్చేసేవాళ్లు ఉంటారు. అలా సిమ్‌లు తీసుకుని ఆ తర్వాత వాడకుండా పక్కన పడేయడమో.. లేకపోతే ఎవరికైనా ఇవ్వడమో చేసిన వాళ్లు చాలా మంది ఉంటారు. ఇంకా వారి ఐడీ కార్డులను దుర్వినియోగం చేసి సిమ్ కార్డులు తీసుకునేవాళ్లు కూడా ఉంటారు. అందుకే కేంద్రం ఒక్కో వ్యక్తికి 9 సిమ్ కార్డుల పరిమితి తీసుకు వచ్చింది. ఒక వేళ తొమ్మిది కంటే ఎక్కువ సిమ్ కార్డ్స్ ఉంటే వారి సిమ్ కార్డులను రీవెరిఫికేషన్ చేయాలని నిర్ణయించింది.
Also Read : పెళ్లికెళ్తే వ్యాక్సిన్ సర్టిఫికెట్ మస్ట్.. లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా ?
9 కంటే ఎక్కువ సిమ్ కార్డులు ఉన్న వారి వివరాలన్నింటినీ పరిశీలిస్తారు. ఒకవేళ ఆ సిమ్‌ల్లో ఏ ఒక్కటి వెరిఫై చేయకపోయిన మిగిలిన నెంబర్లను కూడా డియాక్టివేట్ చేస్తారు. అయితే కొన్ని సున్నితమైన రాష్ట్రాల్లో ఈ నిబంధన మరింత కఠినంగా అమలు చేస్తారు. జమ్మూ కశ్మీర్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లోని వినియోగదారులు ఆరు సిమ్‌ల కంటే ఎక్కువ కలిగి ఉంటే వాటిని పరిశీలించాలని తెలిపింది. 6 కంటే ఎక్కువ సిమ్ కార్డ్స్ ఉన్నట్లయితే కనెక్షన్ కట్ చేస్తారు.
Also Read : దేశంలో 25కు చేరిన ఒమిక్రాన్ కేసులు.. తాజాగా గుజరాత్‌లో మరో ఇద్దరికి..
ఉన్న సిమ్ కార్డుల్లో తమకు నచ్చింది యాక్టివ్‌లో ఉంచుకుని మిగిలిన వాటిని స్విచ్ ఆఫ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. టెలికాం ఆపరేటర్‌లను 9 కంటే ఎక్కువ సిమ్ కార్డ్‌లు కలిగి ఉన్న వినియోగదాను కేంద్రం కల్పించింది. క్రిమినల్ కేసులు, ఆర్థిక నేరాల విచారణలో నేరస్థులను పట్టుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
Also Read : నాడు ఆంధ్రా యూనివర్సిటీ స్టూడెంట్.. నేడు పెన్సిల్వేనియా వర్సిటీ తొలి మహిళా ప్రెసిడెంట్
మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవడం సులువే. https://tafcop.dgtelecom.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. మొబైల్‌కు ఓటీపీ వచ్చాక దాన్ని ఎంటర్ చేయాలి. ఓటీపీ నమోదు చేశాక.. మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో అక్కడ కనిపిస్తుంది. మొబైల్ నంబర్ కింద ఆప్షన్లు కనిపిస్తాయి. ఒకవేళ ఆ నంబర్ మీది కాకపోయినా.. ఆ నంబర్ ఇక మీకు అవసరం లేకపోయినా అక్కడ ఉన్న ఆప్షన్లను ఎంచుకొని ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంటుంది.
Also Read: Farmers Protest Called Off: రైతు ఉద్యమానికి శుభం కార్డు.. దిల్లీ సరిహద్దుల నుంచి ఇళ్లకు రైతులు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి