హైదరాబాద్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. గంజాయి మత్తులో ఓ కిరాతకుడు నిద్రపోతున్న భార్యను గొంతు కోసి హత్య చేశారు. ఆ తరువాత భార్య తల తీసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ పరిధిలో జరిగింది. ఇమాద్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఫర్వేజ్ తో సమ్రీన్‌ బేగంకు 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త ఫర్వేజ్ వేధింపులు తట్టుకోలేక సమ్రీన్‌ గతంలో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత తాను మారిపోయానని నమ్మించి సమ్రీన్‌ను గతేడాది మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. అయితే భార్యపై అనుమానంతో ఫర్వేజ్‌ ఆమెను దారుణంగా హత్యచేశాడు. గంజాయి మత్తులో ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 


Also Read: పరువు కోసం బావ హత్య.. కాబోయే బామ్మర్దులు కత్తులతో ఘాతుకం


విడాకులు.. మళ్లీ పెళ్లి


హైదరాబాద్ నగరంలో ఓ భర్త తన భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు. పక్కనే నిద్రిస్తున్న భార్యపై అమానుషంగా దాడి చేసి హత్య చేశాడు. గాఢ నిద్రలో ఉన్న ఆమె తలనరికి.. తలను నేరుగా పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లి లొంగిపోయాడు. రాజేంద్రనగర్​లోని ఇమాద్‌నగర్‌లో ఫర్వేజ్-సమ్రిన్ నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఫర్వేజ్ వేధింపులు తాళలేక సమ్రిన్ విడాకులు తీసుకుంది. తరువాత ఆమెకు నచ్చజెప్పి రెండో సారి పెళ్లి కున్నాడు ఫర్వేజ్. అయితే అతని బుద్ధి ఏ మాత్రం మారలేదు. రెండో సారి పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెను మరింత వేధింపులకు గురిచేసేవాడు. దీంతో ఇద్దరూ తరచూ గొడవలు పడేవారు. ఆమెను ఎలాగైన కడతేర్చాలని మనసులో పెట్టుకుని సమయం కోసం కాచుకుని హత్య చేశాడు. 


Also Read: తాడేపల్లిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం..! ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ ?


గంజాయి మత్తులో 


శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు ఫర్వేజ్ ఇంటికి వచ్చాడు. అప్పటికే గంజాయి మత్తులో ఫర్వేజ్ భార్య నిద్రపోతున్న గదిలోకి వెళ్లాడు. నిద్రపోతున్న సమ్రీన్‌పై ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. అతి దారుణంగా ఆమె తలపై నరికాడు. ఆమె తలను వేరు చేసి.. తలను తీసుకుని పోలీస్​స్టేషన్​కు తీసుకెళ్లి లొంగిపోయాడు. నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడు గంజాయి మత్తులో ఉన్నట్టు తెలిపారు. సంఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు. భార్యపై అనుమానంతోనే ఫర్వేజ్ ఈ దారుణానికి పాల్పడినట్టు స్థానికులు తెలిపారు. 


Also Read: మూడో భార్యతో ఉంటూ.. రెండో భార్యను చంపాలని భర్త క్షుద్రపూజలు.. చేతబడికి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి