ABP  WhatsApp

Onam Lottery Winner: 'బయటకు వెళ్లాలంటే భయంగా ఉంది- లాటరీ వచ్చినా ఆనందం లేదు'

ABP Desam Updated at: 25 Sep 2022 06:12 PM (IST)
Edited By: Murali Krishna

Onam Lottery Winner: ఓనం బంపర్ లాటరీలో రూ.25 కోట్లు గెలుచుకున్న ఆటో డ్రైవర్ అనూప్ తన బాధలను చెప్పుకొచ్చారు.

(Image Source: PTI)

NEXT PREV

Onam Lottery Winner: ఓనం బంపర్ లాటరీలో రూ.25 కోట్లు గెలుచుకున్న ఆటో డ్రైవర్ అనూప్ గుర్తున్నారా? ఎందుకు గుర్తుండరు.. ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉండుంటారు అనుకుంటున్నారా? కానీ లాటరీ వచ్చినా ఆనందం కంటే అనూప్‌కు ఇప్పుడు బాధే ఎక్కువగా ఉంది. ఇందుకు కారణమేంటంటే?


క్యూ


తను కొన్న లాటరీ టికెట్‌కు రూ.25 కోట్ల తిరువోణం జాక్‌పాట్ రావడంతో అనూప్ ఫుల్ హ్యాపీ అయ్యారు. తన కుటుంబాన్ని పీడిస్తున్న ఆర్థిక ఇబ్బందులకు ముగింపు పలికి మలేసియా వెళ్లిపోవాలనుకున్నారు. అయితే తను లాటరీ గెలిచానన్న విషయం తెలియడంతో సహాయం కోరుతూ ఆయన ఇంటికి జనాలు క్యూ కడుతున్నారు. 


లాటరీలో పన్ను మినహాయింపుల తర్వాత అనూప్‌కు రూ. 15.75 కోట్లు వస్తుంది. ఇది తెలుసుకున్న చుట్టాలు, పక్కాలు, తెలియని వాళ్లు, తెలిసినవాళ్లు అనూప్ ఇంటికి తండోపతండాలుగా వస్తున్నారు. 



నాకు డబ్బు ఇంకా రాలేదు. అందరూ దీన్ని అర్థం చేసుకోవాలి. మేం మా సొంత ఇంట్లోనే ఖైదీల్లా బతుకుతున్నాం. మాస్క్‌తో కూడా బయటకు వెళ్లలేక పోతున్నాం. ఎక్కడికి వెళ్లినా ప్రజలు మమ్మల్ని గుర్తు పడుతున్నారు. ఇది చాలా భయంగా ఉంది. మేం వేరే ఇంటికి మారాలని ఆలోచిస్తున్నాం. నేను సాదాసీదా మనిషిని. ఈ లాటరీ డబ్బులు ఎంత పన్నుల రూపంలో చెల్లించాలో, మిగిలిన డబ్బులను ఎలా దాచుకోవాలో నాకు తెలియదు. నిపుణుల సలహా మేరకు మాత్రమే ఏమైనా చేస్తాను. ప్రస్తుతానికి ఈ డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా పెట్టాలని నిర్ణయించుకున్నాను. -                         అనూప్, ఓనం బంపర్ లాటరీ విన్నర్ 


ఆయన చెప్పాడు!


ఓనం లాటరీ విజేతను ప్రకటించినప్పుడే గత ఏడాది గెలిచిన జయపాలన్ ఓ సూచన చేశారు.



మేం లాటరీ గెలిచిన వెంటనే చాలా మంది సహాయం కోసం వస్తారని ఆయన అన్నారు. అందరికీ సహాయం చేయడం అంత సులభం కాదని, బంధువులు కూడా శత్రువులుగా మారతారని గత ఏడాది లాటరీ గెలిచిన జయపాలన్  అప్పుడే హెచ్చరించారు.                -   అనూప్, ఓనం బంపర్ లాటరీ విన్నర్


ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వీడియోలో అనూప్ తన కొడుకును ఆసుపత్రికి కూడా తీసుకెళ్లలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. 


ఇలా


కేరళ తిరువనంతపురానికి చెందిన  ఆటో డ్రైవర్ అనూప్ ఓనం బంపర్ లాటరీలో ఏకంగా రూ.25 కోట్లు గెలుచుకున్నారు. ఆటో డ్రైవర్​గా పనిచేసే అనూప్.. శ్రీవహారం ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. లాటరీ టికెట్‌కు రూ.50 తక్కువ కాగా.. తన కుమారుడి కిడ్డీ బ్యాంక్‌ నుంచి ఆ డబ్బును తీసుకుని లాటరీ కొన్నారు అనూప్. అదే లాటరీ టికెట్ ఆయనకు రూ.25 కోట్లు తెచ్చిపెట్టింది.


Also Read: Congress President Election: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సెప్టెంబర్ 30న శశి థరూర్ నామినేషన్!


Published at: 25 Sep 2022 06:07 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.