మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్'(God Father) అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార(Nayanthara), సత్యదేవ్(Satyadev) లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 5న ఈ సినిమా విడుదల కానుంది. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేశారు. ఇటీవల సినిమా టీజర్, ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. వీటికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.


ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. అక్కడ వరకు ఓకే కానీ మలయాళంలో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకోవడం ఆశ్చర్యంగా ఉంది. అసలు మెగా నిర్మాతలు ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ సినిమా మలయాళ 'లూసిఫర్'కి రీమేక్ అనే సంగతి తెలిసిందే. 


అందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించారు. ఈ సినిమా అక్కడ రికార్డులు సృష్టించింది. అలాంటి సినిమాను తీసుకొచ్చి తెలుగులో 'గాడ్ ఫాదర్' అనే పేరుతో రీమేక్ చేశారు. అయితే ఇప్పుడు రీమేక్ ను తీసుకెళ్లి మలయాళంలో రిలీజ్ చేయాలనుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. పోనీ చిరుకి అక్కడ మార్కెట్ ఉందా..? అంటే అదీ లేదు. ఆయన నటించిన 'సైరా' సినిమా మలయాళంలో కనీసపు కలెక్షన్స్ ను కూడా రాబట్టలేకపోయింది. 


పైగా అందులో విజయ్ సేతుపతి, సుదీప్ లాంటి స్టార్ హీరోలు ఉన్నారు. అయినా మలయాళీలు ఇంట్రెస్ట్ చూపించలేదు. అలాంటిది తమకు బాగా తెలిసిన లూసిఫర్ కథను మళ్లీ చూడడానికి ఎందుకు వస్తారు..? అయితే ఈ మలయాళ రిలీజ్ విషయంపై ఎలాంటి అధికార ప్రకటన లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం కొన్ని పోస్టర్స్ సర్క్యూలేట్ అవుతున్నాయి. 


Netflix bags the Digital Rights of God Father: మేకర్స్ ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ డీల్స్ ను క్లోజ్ చేస్తున్నారు. రీసెంట్ గా నాన్ థియేట్రికల్ రైట్స్ ను అమ్మేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ రైట్స్ ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఫ్యాన్సీ రేటుకి ఈ హక్కులను అమ్మారట. ఎంత మొత్తమనేది బయటకు రాలేదు. ఇక ఈ సినిమాకి సంబంధించిన గ్రాండ్ ఈవెంట్ ను అనంతపూర్ లో నిర్వహించాలనుకుంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రానుంది.


ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) ఇందులో క్యామియో రోల్ పోషిస్తున్నారు. చిరంజీవికి బాడీగార్డ్ లా కనిపించే రోల్ ఇది. కానీ సినిమా మొత్తం సల్మాన్ కనిపించరు. ఒక యాక్షన్ సీన్ లో ఆయన క్యారెక్టర్ ని హైలైట్ చేసి చూపించబోతున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. మెగాస్టార్ సతీమణి  కొణిదెల సురేఖ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మెహర్ రమేష్ సినిమాలో ‘భోళా శంకర్’, బాబీ దర్శకత్వం మరో సినిమా చేస్తున్నారు.


Also Read : 'ఆదిపురుష్' ట్రెండ్ సెట్టర్ - నేను ప్రభాస్ వీరాభిమాని : సోనాల్ చౌహన్ ఇంటర్వ్యూ


Also Read : ప్లూటు బాబు ముందు ఊదు, జ‌గ‌నన్న ముందు కాదు - బాలకృష్ణకు మంత్రి రోజా కౌంటర్