Karnataka: ఉరేసుకున్న ట్రైనీ- ఆరుగురు IAF అధికారులపై మర్డర్ కేసు!

ABP Desam Updated at: 25 Sep 2022 05:23 PM (IST)
Edited By: Murali Krishna

Karnataka: ఆరుగురు వాయుసేన అధికారులపై మర్డర్ కేసు నమోదు చేశారు కర్ణాటక పోలీసులు.

ఉరేసుకున్న ట్రైనీ

NEXT PREV

Karnataka: కర్ణాటకలోని ఎయిర్‌ ఫోర్స్ టెక్నికల్ కాలేజీ (ఎఎఫ్‌టిసి)లోని ఒక గదిలో అంకిత్ ఝా (27) అనే ఓ క్యాడెట్ ఉరి వేసుకోవడం సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరుగురు వాయుసేన అధికారులపై పోలీసులు మర్డర్ కేసు పెట్టారు. అయితే నాలుగైదు రోజుల క్రితమే ఆ వ్యక్తి మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.







27 ఏళ్ల అంకిత్ ఝా అనే క్యాడెట్.. ఎయిర్‌ ఫోర్స్ టెక్నికల్ కాలేజీలో ఉరి వేసుకుని కనిపించాడు. సెప్టెంబర్ 21న ఈ ఘటన జరిగింది. ఎఫ్ఐఆర్‌లో ఆరుగురు ఐఏఎఫ్ అధికారుల పేర్లు నమోదు చేశాం. మృతుడి కుటుంబం ఇది హత్యగా ఆరోపిస్తోంది. ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశాం.                                          - వినాయక్ పాటిల్, ఉత్తర బెంగళూరు డీసీపీ


పోలీసులపై


మృతుడి సోదరుడు అమన్ ఝా ఫిర్యాదు మేరకు గంగమ్మన గుడి పోలీస్ స్టేషన్‌లో శనివారం ఆరుగురు పోలీసులపై కేసు నమోదు చేశారు. శనివారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో AFTCకి చెందిన వ్యక్తులు తాను వెతుకుతున్న సాక్ష్యంతో పోలీస్ స్టేషన్‌లో ఉన్నట్లు అమన్ ఆరోపించారు. సాక్ష్యాలను తారుమారు చేయడానికి వీరు ప్రయత్నించారని అమన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 



మరణానికి గల కారణం ఇంకా తెలియలేదు. మా దర్యాప్తు కొనసాగుతోంది. అంకిత్ ఝా ఒక ట్రైనీ క్యాడెట్. అతను AFTCలోని ఒక గదిలో ఉరివేసుకుని కనిపించాడు. ఈ కేసులో మాకు సహకరిస్తామని వాయుసేన మాకు హామీ ఇచ్చింది. దర్యాప్తును కొనసాగించడానికి పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నాం.                                                             -      పోలీసు అధికారి


ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఆరుగురు వాయుసేన అధికారులపై కోర్ట్ ఆఫ్ ఇంక్వైరీకి ఆదేశించినట్లు తెలిపారు పోలీసులు.


Also Read: Ankita Bhandari Murder Case: అంకిత భండారి మృతికి కారణమిదే- పోస్ట్‌మార్టం నివేదికలో ఏముందంటే?


Also Read: North Korea: కిమ్ కవ్వింపు చర్యలు- సీరియస్‌గా స్పందించిన దక్షిణ కొరియా!

Published at: 25 Sep 2022 05:18 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.