Ankita Bhandari Murder Case: అంకిత భండారి మృతికి కారణమిదే- పోస్ట్‌మార్టం నివేదికలో ఏముందంటే?

ABP Desam   |  Murali Krishna   |  25 Sep 2022 05:19 PM (IST)

Ankita Bhandari Murder Case: అంకితా భండారి మృతికి గల కారణాలను ఆమె పోస్టుమార్టం నివేదికలో వైద్యులు వెల్లడించారు.

(Image Source: PTI)

Ankita Bhandari Murder Case: ఉత్తరాఖండ్‌లో సంచలనం సృష్టించిన 19 ఏళ్ల రిసెప్షనిస్ట్ అంకిత భండారి మృతికి గల కారణాలు ఆమె పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో వైద్యులు వెల్లడించారు. డ్రౌనింగ్ కారణంగానే ఆమె చనిపోయినట్టు పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. అయితే మృతికి ముందే అంకిత ఒంటిపై గాయాలు అయినట్టు కూడా నివేదిక తెలిపింది.

ఇదే కారణమా?

మునక కారణంగానే ఆమె మరణించినట్టు పోస్ట్‌మార్టం నివేదిక ధ్రువీకరించింది. రిషీకేష్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఈ ముసాయిదా నివేదికను విడుదల చేసింది. ఎయిమ్స్‌కు చెందిన నలుగురు సభ్యుల బృందం ఈ పోస్ట్‌మార్టం నిర్వహించింది. గాయాల వివరాలు, పోస్ట్‌మార్టంలో వెలికిచూసిన విషయాలను తుది నివేదకలో తెలియజేస్తామని ముసాయిదా నివేదక పేర్కొంది.

అంత్యక్రియలకు నో

అయితే పోస్ట్‌మార్టం తుది నివేదక తమకు అందేవరకూ అంకిత అంత్యక్రియులు జరిపేది లేదని ఆమె కుటుంబ సభ్యులు తేల్చిచెప్పారు.

ప్రాథమిక పోస్ట్‌మార్టం నివేదికతో మేం సంతృప్తిగా లేం. తుది నివేదక వచ్చేంత వరకూ అంత్యక్రియలు జరపం. ప్రాథమిక నివేదికలో అసలు వివరాలు ఏం లేవు. అంకిత పనిచేస్తున్న రిసార్ట్‌ను ఎందుకు కూల్చివేశారు. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకే ఈ పని చేశారు.                                                                 - అంకిత కుటుంబసభ్యులు

ఇదీ జరిగింది

హరిద్వార్​కు చెందిన భాజపా నేత వినోద్​ ఆర్య తనయుడు పుల్కిత్ ఆర్య యమకేశ్వర్​లో వనతార రిసార్ట్​ను నడుపుతున్నాడు. రిసార్ట్​లో పౌరి జిల్లా శ్రీకోట్ గ్రామానికి చెందిన అంకితా భండారీ అనే 19 ఏళ్ల యువతి రిసెప్షనిస్ట్​గా పని చేస్తుండేది. సెప్టంబర్​ 19న ఆమె ఇంటికి రాలేదని అంకిత తండ్రి ఉదయపుర్​ తల్లాలోని రాజస్వ చౌకీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో రిసార్ట్​ యజమాని పుల్కిత్ ఆర్యతో పాటు రిసార్ట్​ మేనేజర్​ సౌరభ్​ భాస్కర్​, అసిస్టెంట్​ మేనేజర్​ అంకిత్​ గుప్తా ఉన్నారు. మొదట కేసు విషయంలో పోలీసులను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించిన నిందితులు.. పోలీసులు తమశైలిలో ప్రశ్నించేసరికి నిజాన్ని చెప్పేశారు.

మద్యం తాగించి

అంకితా భండారీని ఎవరు లేని ప్రదేశానికి తీసుకెళ్లి మద్యం తాగించినట్లు నిందితులు తెలిపారు. మద్యం మత్తులో ఉన్న అంకితను హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేశామని చెప్పారు. అంకితతో విభేదాలు రావడం వల్ల ఆమెను హత్య చేసినట్ల విచారణలో ఒప్పుకున్నారు.

కాలువలో యువతి మృతదేహాన్ని గాలించేందుకు పోలీసులు ఓ టీమ్​ను పంపించారు. అంకిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు ఆ మృతదేహం అంకితదే అని ధ్రువీకరించారు.

అందుకే హత్య

రిసార్ట్ యజమానితో పాటు కొంతమంది ఉద్యోగులు అంకిత భండారిని అతిథులకు ప్రత్యేక సేవలు అందించమని కోరేవారని దానికి ఆమె నిరాకరించడం వల్ల వేధింపులకు గురిచేసేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది. మరోవైపు అంకిత వాట్సాప్ చాట్ ద్వారా చాలా విషయాలు వెల్లడయ్యాయని పోలీసులు తెలిపారు. 

Also Read: North Korea: కిమ్ కవ్వింపు చర్యలు- సీరియస్‌గా స్పందించిన దక్షిణ కొరియా!

Also Read: UN Security Council: భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత హోదా- రష్యా మద్దతు!

Published at: 25 Sep 2022 04:33 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.