భారత్ లో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా మహారాష్ట్రలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మరింత కలవరం పెరిగింది. మహారాష్ట్రలో ఇప్పటికే ఎనిమిది ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. తాజాగా ముంబయిలో వచ్చిన కేసులతో మొత్తం సంఖ్య 10కి చేరింది. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 37 ఏళ్ల వ్యక్తితో పాటు అమెరికా నుంచి వచ్చిన మరో వ్యక్తి(36)కి ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 23కి పెరిగింది.
Also Read: 'ఒమిక్రాన్‌కు వేగం ఎక్కువ.. కానీ లక్షణాలు స్వల్పమే'
ఆదివారం ఒక్కరోజే 17 కేసులు
ఆదివారం ఒక్కరోజే దేశంలో 17 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్‌లో తొమ్మిది, మహారాష్ట్రలో ఏడుగురు, దిల్లీలో ఒకరికి ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చింది. వీళ్లంతా దాదాపు ఆఫ్రికా దేశాలకు వెళ్లి వచ్చినవారు, వారికి సన్నిహితంగా ఉన్నవారే కావడం గమనార్హం. దేశంలో ఇప్పటి వరకూ నమోదైన ఒమిక్రాన్ కేసుల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 10, రాజస్థాన్‌లో 9, కర్ణాటక 2, దిల్లీ 1, గుజరాత్‌లో 1 నమోదయ్యాయి. నైజీరియా నుంచి మహారాష్ట్ర వచ్చిన ఓ మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు, ఆమె సోదరుడు, అతడి ఇద్దరు కుమార్తెల్లో ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చింది. ఫిన్లాండ్ నుంచి పుణె వచ్చిన మరో వ్యక్తిలోనూ ఈ వైరస్ గుర్తించినట్లు వైద్యాధికారులు తెలిపారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఒకే కుటుంబంలోని 9 మందికి ఈ వేరియంట్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీరంతా ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి వచ్చినట్లు వెల్లడించింది.
Also Read: దేశంలో కొత్తగా 2,796 మంది మృతి.. దిల్లీలో తొలి ఒమ్రికాన్ కేసు
Also Read: ఒమిక్రాన్ భయాల వేళ పోటెత్తిన శబరిమల.. రికార్డ్ స్థాయిలో 42 వేల మందికి దర్శనం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి