Odisha philanthropic beggar features in photo with PM Modi for Govt of India 2025 calendar: కేంద్ర ప్రభుత్వం ఆనవాయితీగా ప్రదానమంత్రి నరేంద్రమోదీ ఫోటోలతో ఓ అధికారిక క్యాలెండర్ ను విడుదల చేసింది. అ క్యాలెండర్‌లో జనవరి నెల తేదీలను చూపిస్తూ ఉండే ఫోటో చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ ఫోటోలో మోదీ ప్రపంచ నాయకులతో ఉన్న ఫోటోను పెట్టలేదు. కనీసం ప్రముఖులు కూడా కాదు. ఓ  బిచ్చగత్తెతో ఉన్న ఫోటోను పెట్టారు. ఈ ఫోటోను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆమె ఎవరు అని ఆరా తీస్తున్నారు. ఆమె ఒడిషాకు చెందిన బిచ్చగత్తె అని తెలుసుకుని మోదీ ప్రత్యేకత అదే అనుకుంటారు. 

మోదీతో  ఉన్న బిచ్చగత్తె పేరు తులా మౌసి. ఆమె  కంధమాల్ జిల్లాలోని ఫుల్బానీకి చెందిన వృద్ధురాలు. ఆమె వయసు 70 ఏళ్లు. తులా మౌసి జగన్నాథ అలయం వద్ద బిచ్చమెత్తుకుని జీవనం సాగిస్తూ ఉంటారు. అలా బిచ్చమెత్తుకుని తన జీవితాంతం పొదుపు చేసుకున్న రూ. 1 లక్షను   ఫుల్బానీలోని జగన్నాథ ఆలయానికి విరాళంగా ఇచ్చారు. ఈ విషయం బయటకు తెలియడంతో ఆమె పేరు ఒడిషాలో విపరీతంగా ప్రచారం ్యింది.  ఆలయం దగ్గర భిక్షాటన చేస్తూ  సంవత్సరాలుగా శ్రమించి సేకరించిన డబ్బును  ఆలయ నిర్మాణం పునరుద్ధరణకు ఇవ్వడం అమె నిస్వార్థతను చూపిస్తోందని అభినందించారు.  

2024లో మే 11న మోడీ ఎన్నికల ప్రచారం కోసం ఒడిషాలోని ఫుల్బానీకి వెళ్లారు. అప్పుడు ఈ బిచ్చగత్తెను మోదీ పరామర్శించారు. తులా మౌసి దానగుణాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆమె ఆశీర్వాదాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ ఆమెకు ఎమైనా కావాలా అని అడిగారు కూడా. అయితే ఆమె   జగన్నాథుని ఆశీర్వాదం తప్ప మరేమీ వద్దని చెప్పడంతో మోదీ కూడా అదే మాట చెప్పారు.  అటువంటి తల్లి నుండి ఆశీర్వాదం పొందిన తర్వాత, దేశానికి,  ప్రజలకు సేవ చేయడానికి నాకు ప్రేరణ కలిగిందని మోదీ ప్రకటన చేశారు.  

అప్పుడు తీసిన ఫోటోను కేంద్రం క్యాలెండర్ రూపంలో ఉపయోగించుకుంది. ఈ విషయాన్ని బిచ్చగత్తె దృష్టికి కొంతమంది తీసుకెళ్లారు.అయితే ఆమె పెద్దగా ఎగ్జైట్ కాలేదు. మోదీ చూపించిన ఆప్యాయతను గుర్తు చేసుకున్నారు. తనకేమీ అవసరం లేదని. యాచకుల కోసం ఆలయం సమీపంలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేయాలని ఆమె మీడియా ద్వారా ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు. 

ప్రధానమంత్రి ఫోటోలతో క్యాలెండర్ అంటే కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఖచ్చితంగా  ప్రపంచ స్థాయి నేతలతో మోదీ రేంజ్ వాళ్లతో  ఫోటోలను రెడీ చేస్తారు. అలాగే క్యాలెండర్లు వచ్చేవి. కానీ మోదీ మాత్రం అలాంటి వాటిని అసలు ఇష్టపడరు. సామాన్యుల్లో అత్యంత సామాన్యులు అయిన వారితో దిగిన ఫోటోలతోే క్యాలెండర్ ఉండాలని కోరుకుంటారు. ఆ క్రమంలో తులా మౌసి మోదీని ఇన్ స్పయిర్ చేశారు. అందుకే ఆమె క్యాలెండర్ తొలి ఫోటోలోనే దర్శనమిచ్చారు. 

 

Also Readఒక్కడినే వస్తా, నువ్వు ఎవరితో వస్తావో రా... అన్నయ్య విష్ణుకు మంచు మనోజ్ సవాల్