Chiranjeevi: నీ మాటలకు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి - తమన్ ఎమోషనల్ కామెంట్స్‌పై చిరంజీవి రియాక్షన్
Chiranjeevi Tweet on Thaman Comments: డాకు మహారాజ్ ఈవెంట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యాయి. అతడి కామెంట్స్‌పై తాజాగా చిరంజీవి స్పందిస్తూ ట్వీట్ చేశారు.

Chiranjeevi Reacts on Thaman Comments: మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కామెంట్స్‌పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తన మాటలు విన్నప్పుడు తన కళ్లల్లో నిళ్లు తిరిగాయన్నారు. కాగా ఇటీవల సంక్రాంతి సందర్భంగా రిలీజైన డాకు మహారాజ్ మూవీ భారీ విజయం సాధించింది. నాలుగు రోజుల్లోనే ఈ సినిమా వందకోట్ల క్లబ్‌లో చేరింది. ఈ క్రమంలో శుక్రవారం మూవీ టీం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాపై వస్తున్న నెగిటివిటీపై నిర్మాతలను ఉద్దేశిస్తూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.
ఏం బతుకు బతుకుతున్నాం...
ప్రస్తుతం పరిస్థితులు ఎలా మారాయంటే ఒక సినిమా సక్సెస్ అయితే దాన్ని బయటకు చెప్పుకోలేక దుస్థితి వచ్చింది. జీవితంలో సక్సెస్ కావాలని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అసలు సక్సెస్ అనేది లేకుండ ఇండస్ట్రలో మనల్ని ఎవరూ గుర్తించలేరు. అదే లేకపోతే ఫిలింనగర్ వైపు గుండా వెళ్లలేము. అలాంటిది ఒక సక్సెస్ పొందిన నిర్మాత దాన్ని బయటకు చెప్పుకోలేని పరిస్థితులు వచ్చాయి. నెగిటివ్ ట్రోల్స్, కామెంట్స్, ట్యాగ్స్ స్ప్రేడ్ చేస్తున్నారు. ఒక సినిమా రావడంలో కోసం నిర్మాతలు ఎంత కష్టపడుతున్నారో తెలుసా? ఒక సినిమా ఎక్కడో డబ్బులు అప్పుతెచ్చి ఒక మంచి సినిమా తీసి అందిస్తున్నారు. అలాంటి వారిని ప్రతి హీరో అభిమాని, ఇండస్ట్రీ వాళ్లు దేవుళ్లలా చూడాలి. అలాంటి వారిపై తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నారు. ఇప్పుడు ఏ ఇండస్ట్రీకి వెళ్లిన తెలుగులో ఓ మంచి సినిమా చేయాలని అడుగుతున్నారు. అంతగా మన తెలుగు సినిమా ఎదిగింది. కానీ మన సినిమా మనమే చంపేచేసుకుంటున్నాం. మనం ఏం బతుకు బతుకుతున్నామో అర్దం కావడం లేదు. ఒక సినిమా హిట్ అని చెప్పుకోలేకపోతున్నాం. దానంత దరిద్రం ఇంకేముంటుంది.
ఆ బాధ్యత ప్రతి హీరో అభిమానికి ఉంది
ఈ విషయంలో నాకు చాలా బాధకు అనిపిస్తుంది. నా సైడ్ ఏమైనా తప్పు ఉంటే వెంటనే నేను క్షమాపణలు కోరుతాను. నా తప్పు ఉందని నాకు అనిపిస్తే ఏమాత్రం ఆలోచించను కాళ్లపై పడి అయినా క్షమాపణలు అడుగుతాను. ఈ రోజు మన తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచ దేశాలకు వెళ్లింది. విదేశీ భాషల్లోనూ మన తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మన సినిమాలకు గుర్తింపు దక్కుతుంది. ప్రపంచవ్యాప్తంగా మాన తెలుగువాళ్లు ఉన్నారు. మన సినిమాను మనమే బ్రతికించుకోవాలి. సినిమా కాపాడటం మనందరి బాధ్యత. సినిమా బాగాలేకపోతే ఒకే చెప్పండి నేర్చుకుంటాం. కానీ నిర్మాతలు అలా కాదు. మన సోల్ వాళ్లు. మనకు అన్నంపెట్టేవాళ్లని మనం బాధపెట్టడం కరెక్ట్ కాదు. సినిమాకి ఏం తప్పు జరిగిన దాని ప్రభావం నిర్మాతపై పడుతుంది. మనమంత జాగ్రత్తగా ఉందాం. నిర్మాతలను రెస్పెక్ట్ చేయండి. ఈ నెగిటివిటీ ఆపీ సినిమా విషయంలో బాధ్యతగా ఉందాం" అని అన్నారు. తమన్ చేసిన కామెంట్స్ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఆయన మాటల్లోని భావోద్వేగం, బాధ ఇండస్ట్రీ వర్గాల హత్తుకుంటున్నాయి.
Also Read: నేను ఒక్కడినే వస్తా.. నువ్వు పంచదార పక్కన పెట్టిరా.. అన్నయ్య విష్ణుకు మంచు మనోజ్ సవాల్
నీలో ఇంత ఆవేదన ఉందా!
ఈ నేపథ్యంలో తమన్ కామెంట్స్ చిరంజీవి స్పందిస్తూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. డియర్ తమన్ నిన్న మీరు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన దాగి ఉండటం ఒకింత ఆశ్చర్యం కూడా అనిపిస్తుంది. కానీ మనసుకు ఎంత బాధ కలిగితే నువ్వింతగా స్పందించావో అనిపించింది. విషయం సినిమా అయినా క్రికెట్ అయినా మరే సామాజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుదున్న ప్రతి ఒక్కరు తమ మాటల ప్రభావం ఆ వ్యక్తులపై ఎంత ప్రభావం చూపిస్తున్నాయో ఆలోచించాలి. ఎవరోఅన్నట్టు మాటలు ఫ్రీ నే కానీ ఆ మాటల ప్రభావం ఒకరిని స్ఫూర్తి పొందేలా చేస్తే మరోకరిని నాశనం చేస్తాయి. అందుకే ఏదైనా మాట్లాడే ముందు జాగ్రత్తగా పదాలు వాడాలి. నీ మాటలు ఎంత పాజిటివ్‌గా ఉంటే నీ జీవితం కూడా అంతే సానుకూలంగా ముందుకు వెళుతుంది" అని ఆయన పేర్కొన్నారు.
Also Read: టీవీ ఇండస్ట్రీలో ఘోర విషాదం... ట్రక్కు ఢీ కొట్టడంతో 22 ఏళ్ల నటుడు మృతి