Ravichandra Reddy resigned To YCP :  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదీ కలసి రావడం లేదు. పార్టీ నేతలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. కొంత మంది ఏ పార్టీల్లోనూ చేరడం లేదు. మరికొంత మంది వెంటనే ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు. తాజాగా వైఎస్ఆర్‌సీపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న కే రవిచంద్రారెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామాలు చేస్తున్నానని ఆయన వైసీపీ అధ్యక్షుడు జగన్ కు పంపిన లేఖలో రాశారు. అయితే మధ్యాహ్నం ఆయన పురందేశ్వరి, మంత్రి సత్యకుమార్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు.                             

నిన్న మహాసేన రాజేష్, ఇవాళ శ్రీనివాస్ రెడ్డి - లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయయాాలని డిమాండ్ - ప్లానేనా ?

రవిచంద్రారెడ్డి ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. కానీ ఆయన వైసీపీ తరపున బలమైన వాయిస్ వినిపించేవారు. జాతీయ మీడియాలో కూడా వైసీపీ తరపున ఆయనే మాట్లాడేవారు. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నసమయంలో ఆయనకు నామినేటెడ్ పోస్టులు కూడా ఇచ్చారు. అయితే ఎన్నికల తర్వాత ఆయనకు వైసీపీతో గ్యాప్ పెరిగిపోయిందని చెబుతున్నారు. ఎన్నికల తర్వాత మీడియాతో మాట్లాడినప్పుడు.. పలు సందర్భంగాలో పార్టీ ఓటమికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డేనని ఆరోపించేవారు.దీంతో ఆయన టీవీ చానళ్లలో చర్చలను వైసీపీ తరపున పాల్గొననివ్వకూడదని వైసీపీ నిర్ణయించింది.                                

అప్పటి నుంచి ఆయన వైసీపీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. కానీ వ్యక్తిగత హోదాలో యూట్యూబ్ చానళ్లలో పాల్గొని వైసీపీకి మద్దతుగా వాదిస్తున్నారు. వైసీపీపై ఆయనకు అభిమానం ఉంది. అయితే సజ్జల రామకృష్ణారెడ్డిని విమర్శించడంతో ఆయనకు ప్రాధాన్యత లేకుండా పోయింది. జగన్ వద్దకు యాక్సెస్ లేకపోవడం, ఆయనకూడా పట్టించుకోకపోవడంతో చివరికి పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. వైసీపీ తరపున జాతీయ మీడియా సంస్థలతో కూడా ఆయన మాట్లాడటంతో గుర్తింపు ఉంది. బీజేపీలో చేరికకు హైకమాండ్ అందుకే గ్రీన్ సగ్నల్ ఇచ్చిందని భావిస్తున్నారు.                         

ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైసీపీకి చాలా మంది నేతలు  రాజీనామాలు చేస్తున్నారు వారిలో కొంత మంది జనసేన పార్టీలో చేరారు.మరికొంత మంది ఏ పార్టీలో చేరాలన్నది ఇంకా నిర్ణయించుకోలేకపోతున్నారు. నలుగురు ఎమ్మెల్సీలు కూడా రాజీనామాలు చేశారు. పలువురు ద్వితీయ శ్రేణి నేతలు కూడా రాజీనామాలు చేసి కూటమి పార్టీల్లో చేరుతున్నారు. దీంతో వైసీపీకి రాను రాను గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. కేసుల భయంతో చాలా మంది సీనియర్ నేతలు నోరు మెదపడం లేదు. 

Also Readఒక్కడినే వస్తా, నువ్వు ఎవరితో వస్తావో రా... అన్నయ్య విష్ణుకు మంచు మనోజ్ సవాల్