బిహార్‌లో నిరుద్యోగులు చేసిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆర్‌ఆర్‌బీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఉద్యోగార్థులు ఆందోళనలు చేపడుతున్నారు. అయితే ఈరోజు గయాలో రైలు పట్టాలపై ఆందోళనలు చేపట్టిన ఉద్యోగార్థుల్లో కొందరు హింసకు పాల్పడ్డారు. ఆగి ఉన్న భభువా-పట్నా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పుపెట్టారు.
నిరసనకారులను పోలీసులు చెదరగొట్టారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని గయా ఎస్‌ఎస్‌పీ తెలిపారు.
రద్దు చేయాల్సిందే..
మరోవైపు ఆందోళనకారులు సీబీటీ 2 పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
అలా చేయొద్దు..
ఈ ఘటనపై రైల్వే మంత్రి అశ్వినీ కుమార్ వైష్ణవ్ స్పందించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయొద్దని నిరసనకారులకు తెలిపారు.
అంతకుముందు.. ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ, లెవల్ 1 పరీక్షలను నిలిపివేస్తున్నట్లు భారతీయ రైల్వే శాఖ ప్రకటించింది. రైల్వేలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను నిరసిస్తూ పలుచోట్ల ఆందోళనలు చెలరేగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
రాహుల్ ఆగ్రహం..
ఈ ఘటనపై కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరీక్షా విధానాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తోన్న యువతకు మద్దతు పలికారు రాహుల్ గాంధీ. తమ హక్కుల కోసం గళాన్ని విప్పే స్వేచ్ఛ యువతకు ఉందన్నారు.
Also Read: Republic Day 2022 Wishes: సంపూర్ణ స్వేచ్ఛను సాధించుకున్నాం.. నేతల గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు