Republic Day 2022 Wishes: ఎందరో త్యాగధనుల సేవలకు ప్రతిరూపంగా ప్రతి ఏడాది స్వాతంత్య్ర దినోత్స జరుపుకుంటున్నాం. అయితే ఆ స్వాతంత్ర్యాన్ని పూర్తి స్థాయిలో దేశ ప్రజలు వినియోగించుకునేందుకు ప్రత్యేకమైన రోజు గణతంత్ర దినోత్సవం. రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజున జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.
దేశ ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చేందుకు తీసుకొచ్చిన రాజ్యాంగ దినోత్సవం, గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శుభాకాంక్షలు తెలిపారు. సంపూర్ణ స్వేచ్ఛకు రిపబ్లిక్ డే నిదర్శనమని కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు దేశ ప్రజలకు 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విషెస్ చెబుతున్నారు.
‘మన కోరికలన్నీ నెరవేరుతాయి. ఆఖరి రక్తపు బొట్టులా ఉండు, ఎవరి కోసమో అది నీ పెదవులపై నవ్వును ఇస్తుంది, నీకు వందనం. ఈ త్రివర్ణ పతాకం మనది’ అంటూ జైహిందూ అని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పోస్ట్ చేసింది.
జనవరి 26, 1950న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. బ్రిటీష్ వారి నియమాలు కట్టుబాట్లను తెంచుకుంటూ దేశానికి సరైన మార్గనిర్దేశం చేసే రాజ్యాంగాన్ని నవంబర్ 26, 1949లో ఆమోదించారు. బ్రిటన్, అమెరికా, జపాన్, ఐర్లాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, జర్మనీ మరియు కెనడా లాంటి 10 ఇతర దేశాల రాజ్యాంగాల నుంచి భారత రాజ్యాంగంలో కొన్ని విషయాలను తీసుకున్నారు.
73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నా తోటి దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. భారతమాత ముద్దుబిడ్డల ఆకాంక్షలు నెరవేరాలని కోరుకుంటూ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి బుధవారం ఉయదం విషెస్ తెలిపారు.
Also Read: హ్యాపీ రిపబ్లిక్ డే.. దేశభక్తిని రగిలించే ఈ కోట్స్‌తో శుభాకాంక్షలు తెలపండిలా..
Also Read: Happy Republic Day 2022: భారత రాజ్యాంగం గురించి ఈ 12 ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..