India Corona Cases: భారత్‌లో గత మూడు రోజులుగా తగ్గిన కరోనా వైరస్ వ్యాప్తి నేడు మళ్లీ పెరిగింది. నిన్నటితో పోల్చితే దేశంలో 30 వేలకు పైగా పాజిటివ్ కేసులు ఎక్కువ నమోదయ్యాయి. వరుసగా ఐదు రోజులు 3 లక్షలు దాటిన కరోనా కేసులు నిన్న భారీగా తగ్గాయి. నేడు సైతం 3 లక్షల్లోపే కేసులొచ్చాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 2,85,914 (2 లక్షల 85 వేల 914)  మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో మరో 665 మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు. నిన్నటితో పోల్చితే కరోనా మరణాలు 50 వరకు పెరిగాయి.







దేశంలో నిన్న ఒక్కరోజులో 2,99,073 (2 లక్షల 99 వేల 073) మంది కరోనాను జయించారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 22,23,018కు దిగొచ్చింది. భారత్‌లో కరోనా యాక్టివ్ కేసులు చాలా రోజుల తరువాత క్రితం రోజుతో పోల్చితే తగ్గాయి. పాజిటివిటీ రేటు మళ్లీ పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 16.16 శాతానికి తగ్గినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది.  భారత్‌లో కొవిడ్ డోసుల పంపిణీ 163.49 కోట్ల మైలురాయికి చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా వద్ద మరో 13 కోట్ల డోసుల వరకు నిల్వ ఉన్నాయని తెలిపింది. 







ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ 35.79 కోట్ల మంది కరోనా బాధితులుగా మారారు. 56.1 లక్షల మందిని కరోనా మహమ్మారి బలిగొంది. వైరస్ వ్యాప్తిని నిర్మూలించేందుకు 985 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ప్రజలు తీసుకున్నారని ప్రముఖ జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ తాజాగా తెలిపింది.


Also Read: Republic Day 2022: మనదేశం గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించేందుకు జనవరి 26వ తేదీనే ఎందుకు ఎంచుకుంది?


Also Read: హ్యాపీ రిపబ్లిక్ డే.. దేశభక్తిని రగిలించే ఈ కోట్స్‌తో శుభాకాంక్షలు తెలపండిలా..