North Korea Missiles: తెగించేసిన కిమ్- ఒకేసారి 10 బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం!

ABP Desam Updated at: 02 Nov 2022 01:09 PM (IST)
Edited By: Murali Krishna

North Korea Missiles: ఉత్తర కొరియా ఏకంగా 10 బాలిస్టిక్ క్షిపణులను ఒకేసారి ప్రయోగించింది.

(Image Source: Getty)

NEXT PREV

North Korea Missiles: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ జోరు పెంచారు. ఇప్పటివరకు అప్పుడప్పుడూ క్షిపణి ప్రయోగాలు చేసే ఉత్తర కొరియా.. తాజాగా ఒకేసారి 10 బాలిస్టిక్ మిసైల్స్‌ను ప్రయోగించింది. వీటిల్లో కొన్ని దక్షిణ కొరియా సముద్ర జలాల్లో పడ్డాయి. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి.



దక్షిణ కొరియాకు ఇంత దగ్గరగా ఉత్తర కొరియా క్షిపణులు పడటం ఇదే తొలిసారి. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలతో ఉల్లెంగ్డో ద్వీపంలో గగనతల రక్షణ వ్యవస్థ సైరన్‌లు మోగుతూనే ఉన్నాయి. ఈ క్షిపణి ప్రయోగ ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాం. దీనికి ఉత్తర కొరియా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.                        - దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్ ఆఫ్‌ స్టాఫ్‌ 


స్ట్రాంగ్ కౌంటర్


ఉత్తర కొరియా చేపట్టిన క్షిపణి ప్రయోగాలకు దక్షిణ కొరియా తీవ్రంగా స్పందించింది. ఉత్తర కొరియాపై మూడు క్షిపణులను ప్రయోగించింది. తమ భూభాగంపైకి పదికి పైగా క్షిపణులు ప్రయోగించిన గంటల్లోనే ఈ ప్రయోగం జరిగింది. 


కిమ్ వార్నింగ్


దక్షిణకొరియా-అమెరికా విజిలెంట్‌ స్ట్రామ్‌ పేరిట యుద్ధ విన్యాసాలు చేస్తున్నాయి. వీటిల్లో 240 యుద్ధవిమానాలు పాల్గొంటున్నాయి. ఈ విన్యాసాలను ఉత్తరకొరియా తీవ్రంగా ఖండించింది. అమెరికా, దక్షిణా కొరియాలకు వార్నింగ్ ఇచ్చింది.



మాపై దండయాత్ర చేయాలనే అమెరికా, దక్షిణ కొరియాలు సంయుక్త సైనిక విన్యాసాలకు పాల్పడుతున్నాయి. దీనికి మా వైపు నుంచి శక్తిమంతమైన ప్రతి చర్యలు ఉంటాయి. దీనికి ఇరు దేశాలు సిద్ధంగా ఉండాలి              - ఉత్తర కొరియా విదేశాంగశాఖ


అణ్వాయుధ పరీక్షను మరికొన్ని వారాల్లో నిర్వహించేందుకు ఉత్తర కొరియా సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే కిమ్ జోంగ్ ఉన్ అణు హెచ్చరికలు చేయడం కొత్తేం కాదు. అణు యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నట్లు కిమ్ గతంలోనే ప్రకటించారు. అమెరికాకు పరోక్ష హెచ్చరికలు చేశారు. కొరియా యుద్ధ వార్షికోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.



ఎలాంటి సంక్షోభాన్నైనా ఎదుర్కొవడానికి మన బలగాలు సిద్ధంగా ఉన్నాయి. అణు ముప్పును ఎదుర్కోవడానికి కూడా పూర్తి సన్నద్ధతతో ఉన్నాం. యుద్ధం ముగిసి 70 సంవత్సరాలు పూర్తవుతోన్న కూడా దక్షిణ కొరియాతో కలిసి యూఎస్‌ ప్రమాదకరమైన, చట్టవిరుద్ధమైన చర్యలకు దిగుతోంది. మన భద్రతకు ముప్పు కలిగేలా అమెరికా సైనిక విన్యాసాలు చేపడుతోంది. ఈ వైఖరి ఇరు దేశాల సంబంధాలను తిరిగి కోలుకోలేని దశకు దిగజార్చుతాయి. యూఎస్‌, దక్షిణ కొరియా నుంచి ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొవడానికి పూర్తి సిద్ధంగా ఉన్నాం.                                                     "
-కిమ్ జోంగ్ ఉన్, ఉత్తర కొరియా అధినేత



ఢీ అంటే ఢీ


అమెరికాతో సైనిక చ‌ర్య‌కు పూర్తి స్థాయిలో తాము సిద్ధంగా ఉన్న‌ట్లు కిమ్ వెల్ల‌డించారు. అవ‌స‌రం అయితే అణ్వాయుధాల‌ను రంగంలోకి దింపుతామ‌ని హెచ్చ‌రించారు. ఉత్త‌ర కొరియా ఏడ‌వ సారి అణ్వాయుధాన్ని ప‌రీక్షించ‌నున్న‌ట్లు వార్త‌ల వ‌స్తున్న వేళ కిమ్ ఈ వార్నింగ్ ఇచ్చారు. 2017లో చివ‌రిసారి ఉత్త‌ర కొరియా న్యూక్లియ‌ర్ టెస్ట్ నిర్వ‌హించింది. 


Also Read: Kerala HC: భర్త అంగీకారం లేకున్నా ముస్లిం మహిళలు విడాకులు తీసుకోవచ్చు: కేరళ హైకోర్టు తీర్పు

Published at: 02 Nov 2022 01:05 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.