Nobel Peace Prize 2024 Goes To Japanese Organisation Nihon Hidankyo : ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతిని ఈ సారి జపాన్‌కు చెందిన నిహాన్ హిదాన్‌క్యో అనే సంస్థకు ప్రకటించారు. ప్రపంచానికి అణుబాంబుల వల్ల ఎంతో ముప్పు ఉందని..అందుకే అణు అయుధాలులేకుండా చేసేందుకు ఈ సంస్థ ప్రచారం చేస్తోంది. జపాన్ పై రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అణుయుద్ధాలు జరిగాయి. వాటిబారిన పడిన వారు ఇప్పటికీ సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాంటి బాధితులకు ఈ సంస్థ ఎన్నో సేవలు చేస్తోంది. ఆ సేవలను గుర్తింంచచిన నోబెల్ కమిటీ శాంతి బహుమతిని ఈ ఏడాది నిహాన్ సంస్థకు ప్రకటించాలని నిర్ణయించింది.
ఓస్లోలోని నోబెల్ ఇనిస్టిట్టూయట్‌లో ఈ అవార్డు ప్రకటన చేశారుు. నాగసారి, హీరోషిమాలపై జరిగిన బాంబుు దాడుల్లో గాయపడిన వారందరు, ఆ దాడుల వల్ల ఇప్పటికీ శారీరకమైన సమస్యలు ఎదుర్కొంటున్న వారికి తాము గౌరవం ఇస్తున్నట్లుగా నోబెల్ సంస్థ తెలిపింది. వారంతా.. ప్రపంచ శాంతి స్థాపన కోసం తమ అనుభవాలను ప్రపంచం ముందు ఉంచుతున్నారని అలాంటి పరిస్థితి మరి ఎవరికీ రాకుండా చూసుకోవాలని వారు కోరకుంటున్నారని తెలిపింది.