Nipun F-INSAS LCA: 


సైన్యానికి అందజేసిన రాజ్‌నాథ్ సింగ్..


ఆత్మ నిర్భరతలో భాగంగా...రక్షణ రంగానికి సంబంధించిన ఆయుధాలను, వ్యవస్థలను దేశీయంగా తయారు చేసుకుంటోంది భారత్. డీఆర్‌డీవో ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త క్షిపణులు, గన్స్ తయారు చేస్తోంది. ఈ క్రమంలోనే రక్షణ మంత్రిత్వ శాఖ... దేశ సైన్యానికి కొత్త ఆయుధాలను అందజేసింది. మారుతున్న యుద్ధ రీతులకు అనుగుణంగా...సైన్యానికి మరింత శక్తినివ్వనున్నాయి..
ఈ వెపన్స్. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ కొత్త ఆయుధాలను సైన్యానికి అప్పగించారు. వీటిలో నిపుణ్ మైన్స్, లాండింగ్ క్రాఫ్ట్ అసాల్ట్ (LCA)తో పాటు ఫ్యూచరిస్టిక్ ఇన్‌ఫాంట్రీ సోల్జర్ (F-INSAS) సిస్టమ్ ఉన్నాయి. ఓ డ్రోన్‌ సిస్టమ్‌ని కూడా సైన్యానికి అందజేశారు రాజ్‌నాథ్ సింగ్. లద్దాఖ్‌ లాంటి కీలకమైన ప్రాంతాల్లో శత్రుసైన్యంపై పోరాటం చేయటానికి ఈ ఆయుధాలు ఎంతగానో ఉపకరించనున్నాయి.





 


డీఆర్‌డీవో ఆధ్వర్యంలో తయారీ..


పదాతి దళంలోని సైనికుడుని "సెల్ఫ్ కంటెయిన్డ్ మెషీన్‌" లా మార్చేదే...F-INSAS సిస్టమ్. సైనికుల ఆపరేషన్ సామర్థ్యాన్ని పెంచటమే కాకుండా...అన్ని వాతావరణాల్లోనూ, ప్రాంతాల్లోనూ సులువుగా వాడుకునేలా ఉంటుందీ సిస్టమ్. పైగా...బరువు, నిర్వహణా వ్యయం కూడా తక్కువే. ఈ సిస్టమ్‌ని పూర్తిగా దేశీయంగా తయారు చేశారు. ఆర్మీతో పాటు ప్రైవేట్ ఇండియన్ ఇండస్ట్రీస్, డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్‌ ప్రమాణాలకు అనుగుణంగా ఈ సిస్టమ్ రూపొందించారు. డీఆర్‌డీవో, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఇకోసిస్టమ్ సంయుక్తంగా దీన్ని డిజైన్ చేశాయి. యూకే, ఫ్రాన్స్, ఇజ్రాయేల్, జర్మనీ లాంటి దేశాల్లోని ఆయుధ వ్యవస్థల్ని పరిశీలించి అదే స్థాయిలో భారత్‌లోనూ ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. అన్ని వివాదాస్పద ప్రాంతాల్లోనూ ఈ సిస్టమ్‌ని అప్‌గ్రేడ్ చేసేందుకు భారత సైన్యం సిద్ధమవుతోంది. ఈ సిస్టమ్‌లో బాలిస్టిక్ హెల్మెట్స్, బాలిస్టిక్ గాగుల్స్, బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్‌లు ఉంటాయి. ఈ బులెట్ ప్రూఫ్ జాకెట్లు..9mm బులెట్స్‌ని కూడా అడ్డుకుంటాయి. AK-47 రైఫిల్స్‌తో దాడి చేసేందుకూ వీలుంటుంది. బాలిస్టిక్ హెల్మెట్‌లో నైట్ విజన్ డివైస్ పొందుపరిచారు. థర్మల్ ఇమేజరక్ కూడా అందులో ఉంటుంది. AK-203 రైఫిల్స్‌నీ వినియోగించే వీలుంటుంది. 


నిపుణ్ మైన్స్ అంటే..? 


శత్రువులను కానీ, వాళ్ల యుద్ధ ట్యాంకులను కానీ పడగొట్టేందుకు నిపుణ్ ల్యాండ్‌మైన్స్‌ ఉపయోగపడనున్నాయి. పుణేలోని ఆర్మామెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ARDE)ఈ ల్యాండ్‌మైన్స్‌ని తయారు చేసింది. వీటిలోని అడ్వాన్స్‌డ్ డిజైన్, సెన్సార్లు వీటిని ప్రత్యేకంగా నిలబెడతాయి. చిన్న సైజ్‌లో ఉండటం వల్ల పెద్ద మొత్తంలో వీటిని డిప్లాయ్ చేసేందుకు వీలవుతుంది. 


ఏంటీ ఎల్‌సీఏ..? 


ల్యాండింగ్ క్రాఫ్ట్ అసాల్ట్ (LCA)ని ఈస్టర్న్ లద్దాఖ్‌ లాంటి సున్నితమైన ప్రాంతాల్లో డిప్లాయ్ చేసుకునేందుకు అవకాశమంటుంది. లద్దాఖ్‌లోని సరస్సులు దాటేందుకు పడవలను వినియోగిస్తుంటారు. వాటికి బదులుగా LCAని వినియోగించవచ్చు. పడవల్ని LCA వెజెల్స్‌తో రీప్లేస్ చేయొచ్చు. గోవాలోని ఆక్వారియస్ షిప్‌యార్డ్ లిమిటెడ్ కంపెనీ దీన్ని తయారు చేసింది. జలాల్లో వేగంగా దూసుకుపోయేందుకు ఈ వెజెల్స్‌ ఉపకరిస్తాయి. వీటితో పాటు ట్యాంక్ T-90 కోసం కమాండర్ థర్మల్ ఇమేజింగ్ సైట్ తయారు చేశారు. 


Also Read: Kerala Court: మహిళల డ్రెసింగ్‌, లైంగిక వేధింపులపై కేరళ సెషన్స్ కోర్టు సంచలన కామెంట్స్