Hand Model in New York: మోడలింగ్ అంటే అంత సింపుల్ కాదు. ఈ ఫీల్డ్‌లో క్లిక్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. ముఖ్యంగా అమ్మాయిలకు సవాలక్ష స వాళ్లు ఎదురవుతాయి. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా ఉంటుంది. కాస్త ఫేమస్ అయితే చాలు టాప్ బ్రాండ్స్ అన్నీ అంబాసిడర్స్‌గా పెట్టుకుంటాయి. కానీ ఈ మోడలింగ్‌లోనూ కొత్త తరహాలో రాణిస్తున్న వాళ్లున్నారు. అలాంటి వ్యక్తుల్లో ఒకరు న్యూయార్క్‌కి చెందిన (Alexandra Berrocal) అలెగ్జాండ్రా బెరోకల్. ఏటా 30 వేల డాలర్లు సంపాదిస్తోంది. అందరిలానే చేస్తే ప్రత్యేకత ఏముంటుంది..? అందుకే ఆమె కొత్త దారి వెతుక్కుంది. జస్ట్ చేతులతోనే మోడలింగ్ చేసేస్తోంది. Hand Model గా మార్కెట్‌లో మంచి పాపులారిటీ తెచ్చుకుంది 37 ఏళ్ల అలెగ్జాండ్రా. 2019లో మోడలింగ్ రంగంలో అడుగు పెట్టింది. మైక్రోసాఫ్ట్, YSL సహా టాప్ బ్రాండ్స్‌ని ప్రమోట్ చేసింది. ఓవైపు ఫుట్‌వేర్ డిజైన్ ఇండస్ట్రీలో ఫుల్‌టైమ్ జాబ్ చేస్తూనే ఇలా మోడలింగ్ చేస్తోంది.
(Image Credits: New York Post)
హ్యాండ్ మోడలింగ్ ఏంటి..?
హ్యాండ్ మోడలింగ్ అంటే కేవలం చేతులతోనే బ్రాండ్స్‌ని ప్రమోట్ చేయడం. ఉదాహరణ ఓ బ్యాగ్ కంపెనీ ఉందనుకుందాం. అలెగ్జాండ్రా ఆ బ్యాగ్‌ని చేతులతో పట్టుకుని ఫొటో షూట్ చేస్తుంది. వాటినే ప్రమోట్ చేస్తుంది. బ్యాగ్‌లు అనే కాదు. జ్యువెలరీ, కాఫీ పౌడర్, నెయిల్ పెయింట్స్..ఇలా ప్రొడక్ట్ ఏదైనా సరే చేతితే ప్రమోట్ చేసే వీలుగా ఉంటే చాలు. అలెగ్జాండ్రా వాటికి బ్రాండింగ్ చేసేస్తుంది. ఇంతకీ ఇలా హ్యాండ్ మోడలింగ్ ఎందుకు చేస్తున్నారని అడిగితే...మనకంటూ స్పెషాల్టీ ఉండాలిగా అని చెబుతోంది. మరో కారణాన్నీ వివరిస్తోంది.
"నా చేతులు చాలా చిన్నగా ఉంటాయి. అలా ఉన్నందుకు నేనెప్పుడూ బాధపడలేదు. వాటిని నాకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలా అని ఆలోచించాను. అలా మొదట్లో చేతులతోనే బ్యూటీ ప్రొడక్ట్స్‌ని షూట్ చేశాను. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలా నా చిన్న చేతులతోనే పెద్ద పెద్ద బ్రాండ్స్‌కి మోడలింగ్ చేసేస్తున్నాను"
- అలెగ్జాండ్రా బెరోకల్, హ్యాండ్ మోడల్
(Image Credits: New York Post)
నాలుగేళ్లుగా హ్యాండ్ మోడల్‌గా..
దాదాపు నాలుగేళ్లుగా ఆమె హ్యాండ్ మోడల్‌గా తన కెరీర్‌ని కొనసాగిస్తోంది. ఒక్కో నెల దాదాపు 10 షూటింగ్‌లతో చాలా బిజీగా ఉంటానని చెబుతోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే...టాప్ బ్రాండ్స్ అన్నీ తననే వెతుక్కుంటూ వస్తున్నాయట. అందుకే తన చేతులు అందంగా ఉంచుకునేందుకు చాలానే కష్టపడుతుందట. ఎక్కడా స్కార్స్ లేకుండా జాగ్రత్త పడుతుంది. గోళ్లు పెంచుకోవడంలోనూ జాగ్రత్తలు తీసుకుంటుంది. కొన్ని కంపెనీలైతే ఆమె చేతులకూ మేకప్ వేసి మరీ షూట్ చేస్తున్నాయట. "నా చేతులకు ఇంత డిమాండ్ ఉంటుందని ఊహించలేదు" అని నవ్వుతూ చెబుతోంది అలెగ్జాండ్రా. ఇక్కడితోనే ఆగిపోకుండా కళ్లు, కాళ్లతోనూ మోడలింగ్ చేయాలనుందని అంటోంది. చేతులు అందంగా ఉండేందుకు రోజూ నిద్రపోయే ముందు వెన్న రాస్తుందట. అంతకు మించి మరే లోషన్స్ వాడదట. "ఇదే నా చేతుల అంద రహస్యం" అని వివరిస్తోంది.
Also Read: Elon Musk China Visit: భారత్ పర్యటన రద్దు తరవాత చైనాకి వెళ్లిన మస్క్, ఏం ప్లాన్ చేస్తున్నారు?