Aamir Khan In The Great Indian Kapil Show : 'ది గ్రేట్ ఇండియ‌న్ కపిల్ షో. ఈ షో 'కి ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ‌. బాలీవుడ్ సెల‌బ్రిటీల‌ను క‌పిల్ ఇంట‌ర్వ్యూ చేస్తుంటారు ఈ షోలో. ప్ర‌స్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది ది గ్రేట్ ఇండియ‌న్ క‌పిల్ షో. అయితే, ఈ షోకి గెస్ట్ గా వ‌చ్చారు బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్. ఆయ‌న ఈ షోకి రావ‌డం ఇదే మొద‌టిసారి. కాగా.. ఆయ‌న‌కు సంబంధించి ఎన్నో విష‌యాల‌ను, జీవిత అనుభ‌వాల‌ను ప్రేక్ష‌కుల‌తో పంచుకున్నారు అమీర్ ఖాన్. త‌న మాజీ భార్య త‌న‌ని కొట్టింద‌ని, కొరికింద‌ని ప్రెగ్నెన్సీ టైంలో ఆమె అలా చేసింద‌ని చెప్పుకొచ్చారు. 


చెంప‌మీద కొట్టి.. గట్టిగా కొరికింది.. 


ఈ ఎపిసోడ్ లో ప్ర‌శ్న‌లు అడిగిన క‌పిల్.. "మీ కెరీర్ లో యాక్ట‌ర్ గా జ‌నాల్ని ఎలా గ‌మ‌నించారు" అని అడిగిన ప్ర‌శ్న‌కు అమీర్ ఖాన్ ఇలా చెప్పారు. "నేను ఏమి నోటీస్ చేశానో మీకు చెప్తాను. అది జునాయిద్ డెలివ‌రీ రోజు. రీనా జీ నొప్పులు ప‌డుతున్నారు. మేమంతా హాస్పిటల్ లో ఉన్నాం. భార్య‌కి ఆ టైంలో భ‌ర్త స‌పోర్ట్ గా ఉండాలి. అందుకే, ఆమెకి కొన్ని బ్రీతింగ్ ఎక్స‌ర్ సైజ్ లు చెప్తున్నాను. నొప్పులు బాగా ఎక్కువ‌య్యాయి. దాంతో ఆమెకు ఉప‌శమ‌నం క‌లిగించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాను. కానీ, ఆమె మాత్రం న‌న్ను చెంప మీద చెల్లుమ‌ని కొట్టింది. "స్టాప్ నాన్ సెన్స్" అంటూ నా చేతిని కూడా కొరికేసింది. మ‌నిషికి పెయిన్ ఉంటే ఎలా బిహేవ్ చేస్తారో నాకు అర్థం అయ్యింది" అని చెప్పారు అమీర్ ఖాన్. 


హ్యూమ‌న్ ఎమోష‌న్స్ అలా ఉంటాయి.. 


బాధ‌లో ఉన్న‌ప్పుడు మ‌నిషి ఎమోష‌న్స్ ఎలా ఉంటాయో త‌న‌కు అప్పుడు అర్థం అయ్యింద‌ని చెప్పారు అమీర్ ఖాన్. “ నా చుట్టూ ఏం జ‌రుగుతుందో నాకు అప్పుడు అర్థం అయ్యింది. మ‌హిళ పిల్ల‌ల్ని క‌నేట‌ప్పుడు ప‌డే బాధ ఒక మ‌నిషిలో క‌లిగితే ఎలా ఉంటారో  నాకు తెలిసింది. నేను దాన్ని ఎక్స్ పెక్ట్ చేయ‌లేదు. కానీ, అలా జ‌రిగిపోయింది. రీనా ముఖాన్ని నేను నా చేతుల్లోకి తీసుకుని ఆమె క‌ళ్ల‌లోకి చూస్తూ అది మామూలు పెయిన్, దాన్ని కంట్రోల్ చేయొచ్చు అనుకున్నాను. నొప్పి ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు దాని వ్య‌క్తీకర‌ణ చాలా ఆశ్చ‌ర్యంగా అనిపిస్తుంది" అని చెప్పారు అమీర్ ఖాన్. 


అమీర్ ఖాన్, రీనా ఇద్ద‌రు 2002లో విడాకులు తీసుకున్నారు. వాళ్లిద్ద‌రికి జునాయిద్ ఖాన్, ఐరా ఖాన్ పిల్ల‌లు ఉన్నారు. ఇక రీనాతో విడాకులు త‌ర్వాత అమీర్ ఖాన్.. కిర‌ణ్ రావ్ ని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ల‌కి అజాద్ రావ్ ఖాన్ అనే కొడుకు ఉండ‌గా.. ఇద్ద‌రు 2021లో విడిపోయారు. ప్ర‌స్తుతం ఆయ‌న న‌టించిన సినిమాలు పెద్ద‌గా ఆడ‌ట్లేదు. అంత‌గా స‌క్సెస్ కాలేదు. దీంతో త‌ర్వాత చేసే సినిమా ఆచితూచి క‌రెక్ట్ గా చేయాల‌ని భావిస్తున్నార‌ని టాక్ వినిపిస్తోంది. దీనిలో భాగంగా రాజమౌళి, మ‌హేశ్ బాబు కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమాకి ఆయ‌న ఒప్పుకున్న‌ట్లు బీ టౌన్ లో పుకారు ఉంది. 



Also Read: గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి సినిమాలో ఎన్టీఆర్​ను ఇమిటేట్ చేశారా అంటూ ప్రశ్న.. విశ్వక్ సమాధానం ఏమిటంటే..