New Covid Variant: టీకా వేసుకున్నారా? అయినా జాగ్రత్తగా ఉండాల్సిందే- పండుగ వేళ వార్నింగ్!

ABP Desam Updated at: 20 Oct 2022 04:33 PM (IST)
Edited By: Murali Krishna

New Covid Variant: పండుగ వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలు తప్పక పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

(Image Source: PTI)

NEXT PREV

New Covid Variant: దేశంలో కరోనా కొత్త వేరియంట్ గుబులు పుట్టిస్తోంది. అక్టోబర్‌ మొదటి 15 రోజుల్లోనే మహారాష్ట్రలో కనీసం 18 ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ సబ్-వేరియంట్ కేసులు నమోదయ్యాయి. పండుగ సీజన్‌ కనుక కరోనా నిబంధనలను పాటించడంలో అలసత్వం వహించవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


టీకా తీసుకున్నా సరే!



కొత్త వేరియంట్ వచ్చిన తర్వాత కొవిడ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. మహారాష్ట్రలో గత వారం కొత్త కేసులు 17.7 శాతం పెరిగాయి. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నా, బూస్టర్ డోస్ తీసుకున్న తర్వాత కూడా మళ్లీ కరోనా సోకిన కేసులు బయటకువస్తున్నాయి. అయితే వ్యాక్సిన్‌లు ఒక వ్యక్తిలో ఇన్‌ఫెక్షన్‌ తీవ్రతను గణనీయంగా తగ్గిస్తాయి. ఈ కొత్త వేరియంట్ స్పైక్ ప్రోటీన్ మ్యుటేషన్ ద్వారా వ్యాపిస్తుంది. రోగనిరోధకతను తప్పించుకునే లక్షణాలను కలిగి ఉంది.  -  DK గుప్తా, ఫెలిక్స్ హాస్పిటల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ (నోయిడా)
 
  
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర దేశాల్లో పరిస్థితిని పర్యవేక్షించి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని గుప్తా కోరారు. 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ మొదలుపెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం వాళ్లు హై రిస్క్ కేటగిరీలో ఉన్నారన్నారు. 


మరో వేరియంట్


ఒమిక్రాన్‌లో ఇటీవల ప్రమాదకరమైన వేరియంట్ BF.7 పుట్టుకొచ్చింది. దీని తొలికేసు చైనాలోని మంగోలియా ప్రాంతంలో బయటపడ్డాయి. ఇప్పుడక్కడ ఈ వేరియంట్ బారిన పడిన కేసులు పెరుగుతున్నాయి.అక్కడ్నించి ఈ వేరియంట్ ఇప్పటికే ఎన్నో దేశాలకు ప్రయాణం కట్టింది. ఇంకా మనదేశం చేరలేదులే అనుకుంటున్న సమయంలో ఇటీవల ఓ కేసు బయటపడింది. ఆ వ్యక్తి లక్షణాలన్నీ BF.7 వేరియంట్ అని అనుమానించేలా ఉన్నాయి. గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ ఈ కొత్త కేసును గుర్తించింది. ఇది వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలున్న వేరియంట్ గా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. 


ఒమిక్రాన్ వేవ్ వచ్చాక ఏడాది కాలంగా ఏ వేవ్ లేకుండా ప్రశాంతంగా ఉన్నారు ప్రజలు. కానీ ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ కారణంగా వేవ్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఆరోగ్యనిపుణులు. ముఖ్యంగా దీపావళి ముందు ఈ వేరియంట్ భారత్ లో అడుగుపెట్టడం కాస్త కలవరపెట్టే విషయమే. ఎందుకంటే దీపావళికి బంధువులు,స్నేహితులు ఒకేచో గుమిగూడడం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి BF.7 వేరియంట్ త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని, తద్వారా BF.7 వేవ్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.



ఈ వేరియంట్ చాలా బలమైనది, వ్యాక్సిన్ల ద్వారా వచ్చిన రోగనిరోధక శక్తిని కూడా తట్టుకుని శరీరంలో నిలబడగలదు. అందుకే దీపావళికి ఎక్కువ జనసందోహం ఉన్న ప్రదేశాల్లో ఉండాల్సి వస్తే కచ్చితంగా మాస్క్ ధరించండి.                                             - నిపుణులు
 


Also Read: Omicron BF.7: దేశంలోకి అడుగుపెట్టిన ఒమిక్రాన్ కొత్త వేరియంట్ BF.7, ఇది ప్రమాదకరమైనదే అంటున్న ఆరోగ్యనిపుణులు

Published at: 20 Oct 2022 02:30 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.