Sharad Pawar Remark on Women Reservation:


ఎప్పటి నుంచో చర్చ..


పార్లమెంట్‌లో మహిళా కోటాపై నేషనల్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. నార్త్ ఇండియా, పార్లమెంట్‌... లోక్‌సభ, అసెంబ్లీలో మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో అనుకూలంగా లేనట్టు కనిపిస్తోందని అన్నారు. మాజీ కేంద్రమంత్రి పవార్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. పుణె డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన...ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయనతో పాటు ఆయన కూతురు సుప్రియా సూలేను ఈ కార్యక్రమంలో ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగానే మహిళా రిజర్వేషన్ బిల్‌ (Women's Reservation Bill)పై చర్చ వచ్చింది. ఈ బిల్ ప్రకారం..లోక్‌సభ సహా అసెంబ్లీల్లో 33% కోటా మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. అయితే...ఇది బిల్లు దశలోనే ఆగిపోయింది. ఇప్పటికీ పార్లమెంట్‌లో పాస్ అవ్వలేదు. దీన్ని ఉద్దేశిస్తూనే...బహుశా భారత్‌ ఈ బిల్‌ను చట్టంగా మార్చేందుకు మానసికంగా ఇంకా సిద్ధంగా లేదేమో అని అన్నారు శరద్ పవార్. మహిళల అధికారాన్ని
అంగీకరించేందుకు రెడీగా లేరని చెప్పారు. కాంగ్రెస్‌ తరపున లోక్‌సభ ఎంపీగా ఉన్నప్పటి నుంచి ఈ విషయంపై మాట్లాడుతున్నానని గుర్తు చేశారు. 


రెడీగా లేరు..


"పార్లమెంట్‌, ముఖ్యంగా ఉత్తర భారతం మహిళా రిజర్వేషన్లను ఒప్పుకునేందుకు సిద్ధంగా లేరు. కాంగ్రెస్ ఎంపీగా ఉన్న సమయంలో లోక్‌సభలో ఎన్నో సార్లు ఈ అంశంపై చర్చించాను. దీనిపై మద్దతు కోరితే...అప్పట్లో నా సొంత పార్టీ వాళ్లు కూడా సపోర్ట్ చేయలేదు. మద్దతు తెలిపిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉండేది. అన్ని పార్టీలు ఏకమై ఈ బిల్లు పాస్ అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. "నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లా పరిషద్, పంచాయత్ సమితీ లాంటి స్థానిక పరిపాలనా సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చాను. మొదట్లో దీనిపై బాగా వ్యతిరేకత వచ్చింది. కానీ క్రమంగా ప్రజలు దాన్ని అంగీకరించారు" అని పవార్ వెల్లడించారు. 


Also Read: NIA Searches: తెలుగు రాష్ట్రాల్లో NIA సోదాలు కలకలం! నిజామాబాద్, కర్నూల్ సహా కొన్ని జిల్లాల్లో భారీగా తనిఖీలు


Also Read: Chandigarh University Protest: యూనివర్సిటీలో దారుణం- యువతులు స్నానం చేస్తోన్న వీడియోలు లీక్!