ఆ రాష్ట్రాల్లోనే ఎక్కువ..


దేశంలోని 11 రాష్ట్రాలు సహా కేంద్ర పాలిత ప్రాంతాల్లో పురుషులతో పోల్చి చూస్తే..మహిళలకే ఎక్కువ మంది సెక్స్ పార్ట్‌నర్స్ ఉన్నారని ఇటీవలి సర్వేలో తేలింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NHS) ఈ విషయం వెల్లడించింది. దేశవ్యాప్తంగా లక్షా పది వేల మంది మహిళలు, లక్ష మంది పురుషులపై సర్వే చేసిన NHS..పురుషుల కన్నా మహిళలకే శృంగార భాగస్వాములు ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది. రాజస్థాన్, హరియాణా, ఛండీగఢ్, జమ్ముకశ్మీర్, లద్దాఖ్, మధ్యప్రదేశ్, అస్సాం, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరి, తమిళనాడు ఈ లిస్ట్‌లో ఉన్నాయి. రాజస్థాన్‌లో అత్యధికంగా మహిళల సెక్స్ పార్ట్‌నర్స్‌ రేటు 3.1కాగా...అదే రాష్ట్రంలో పురుషుల సెక్స్ పార్టనర్స్ రేటు 1.8గా ఉంది. అంటే... మహిళలే ఈ విషయంలో ముందున్నారు. పట్టణాలతో పోల్చి చూస్తే...గ్రామాల్లోనే సెక్స్ పార్ట్‌నర్స్  సగటు అధికంగా ఉంది. సిటీస్‌లో అయితే..ఓ పురుషుడు 1.7 మందితో లైంగిక సంబంధం పెట్టుకోగా...అదే ఓ మహిళ 1.5 మందితో సెక్స్ పార్టనర్‌గా ఉంటోందని సర్వేలో తేలింది. 2019-21 మధ్య కాలంలో ఈ సర్వే చేపట్టారు. మొత్తం 28 రాష్ట్రాల్లోని 707 జిల్లాల నుంచి వివరాలు సేకరించారు.


సర్వేలోని మిగతా వివరాలు..


గతేడాది ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందితో శారీరక సంబంధం కలిగి ఉన్న పురుషులు 1.2 శాతం కాగా, మొత్తం లైఫ్‌ టైమ్‌లో 2.1 మందితో లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్నట్లు సర్వే వెల్లడించింది. అదే విధంగా, గతేడాది దేశవ్యాప్తంగా ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందితో శారీరక సంబంధాన్ని కలిగి ఉన్న స్త్రీల సంఖ్య 0.3%. వారి లైఫ్‌టైమ్‌లో సెక్స్‌ పార్టనర్ల సంఖ్య 1.7గా ఉంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NHS) ప్రకారం ఏపీలో గతేడాది ఇద్దరి కంటే ఎక్కువ మందితో శారీరక సంబంధాన్ని పెట్టుకున్న మహిళలు 0.1% కాగా, పురుషులు 1.2 శాతంగా ఉన్నారు. తెలంగాణలో గతేడాది 0.4 శాతం మంది మహిళలు ఇద్దరు కంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధం పెట్టుకున్నారు. 
ఇది పురుషుల్లో 2.1శాతంగా ఉన్నట్టు సర్వే తెలిపింది. 


Also Read: న్యాయవ్యవస్థపై విశ్వాసం కాపాడేలా చర్యలు అవసరం: సీజేఐ