Nahid Islam is the key player behind the student movement in Bangladesh :  బంగ్లాదేశ్‌ సంక్షోభానికి కారణం ఎవరు ?. చాలా మంది చాలా రకాలుగా విశ్లేషిస్తారు కానీ.. విద్యార్థి లోకం, యువత తిరుగుబాటు చేయడమే ప్రధాన కారణం. ఆ విద్యార్థి ఉద్యమానికి బీజం వేసింది.. కార్చిచ్చులా అంటులేనేలా చేసింది మాత్రం.. ఓ యువకుడు. అతని పేరు నహీద్ ఇస్లాం. ఢాకా యూనివర్శిటీలో సోషియాలజీ చదువతున్న ఆయన ..మొదట షేక్ హసీనా తెచ్చిన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా గళమెత్తారు. అది ఎప్పుడో కాదు.. గత నెల కిందటే. 


జూలైలో ఉద్యమం ప్రారంభించిన నహిద్ ఇస్లాం 


సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో 30 శాతం స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు రిజర్వ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. అలా అయితే యువతకు అన్యాయం జరుగుతుందని ..హైకోర్టు తీర్పును అంగీకరించకూడదని రిజర్వేషన్లు లేకుండా చట్టం చేయాలని జూలైలో విద్యార్థులు ఉద్యమం ప్రారంభించారు. కానీ హసీనా అంగీకరించలేదు. కోర్టు తీర్పు ప్రకారమే నడుచుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనిపై జూలై  ఒకటో తేదీన ఢాకా విశ్వవిద్యాలయంలో  నహీద్ ఇస్లాం విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. అప్పటి నుంచి ఆయన నాయకత్వంలో ఆందోళనలు అంతకంతకూ పెరిగిపోయాయి. దేశమంతా విస్తరించాయి. 


బంగ్లాదేశ్‌‌కు ముందే ఆ సలహా ఇచ్చాం, అక్కడి పరిస్థితుల్ని గమనిస్తున్నాం - జైశంకర్ కీలక వ్యాఖ్యలు


నహిద్ వెంట నడిచిన యువత                           


ఓ సారి పోలీసులు నహీద్ ఇస్లాంను తీసుకెళ్లి తీవ్రంగా హింసించి తర్వాత రోడ్డు మీద పడేశారు. అయినా నహీద్ ఇస్లాం వెనక్కి తగ్గలేదు. కోలుకోక ముందే మళ్లీ ఉద్యమం కొనసాగించారు. ఈ క్రమంలో ఉద్యమం తీవ్ర రూపం దాల్చి మూడు వందల  మందికిపైగా చనిపోయారు. దీంతో  ప్రభుత్వ అణిచివేత ధోరణిపై ప్రజల్లో మరింత విరక్తి పుట్టింది. విద్యార్థి లోకం అంతా షేక్ హసీనా ఇంటి ముట్టడికి పిలుపునివ్వడంతో.. ఇతర వర్గాలు కూడా కలసి వచ్చాయి. వారికి ఆర్మీ కూడా మద్దతు పలకడంతో పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. షేక్ హసీనా తన అధికారిక నివాసం నుంచి పరారీ కావాల్సి వచ్చింది.                                 


షేక్ హసీనా కోసం రఫేల్ యుద్ధ విమానాలు - భారత్ చేరుకునే వరకూ హైవోల్టేజ్ యాక్షన్ సీన్లే !


ప్రభుత్వ ఏర్పాటులోనూ నహిద్ అభిప్రాయం కీలకం              


ఇప్పడు తాత్కలిక ప్రభుత్వ ఏర్పాటులోనూ సైన్యం నహీద్ ఇస్లాం అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. తాత్కలిక ప్రభుత్వం ఏర్పాటు విషయంలో నహీద్ తన వాదన గట్టిగా వినిపిస్తున్నారు. నోబెల్ అవార్డు పొందిన యూనస్ చీఫ్ అడ్వయిజర్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నహీద్ డిమాండ్ చేస్తున్నరు. ఈ అంశంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు నహీద్ బంగ్లాదేశ్ లో బలమైన స్టూడెంట్ లీడర్ గా ఎదిగారు. ఆయన పేరు మార్మోగిపోతోంది.