Indian Army Saved Sheikh Hasina With With Rafale Fighter jets :   భారత యుద్ధ విమానాలు, వాటి పైలట్ల ధైర్య సాహాసాలతో ఇటీవలి కాలంలో చాలా సినిమాలు వచ్చాయి. యుద్ధ విమానాలు అంటే కేవలం బాంబులు వేసి వస్తాయని అనుకుంటారు కానీ.. అవి ఆకాశంలో చేసే పనులు చాలా గొప్పగా ఉంటాయి. రఫేల్ యుద్ధ విమానాలు.. బంగ్లాదేశ్ మాజీ  ప్రధాని షేక్ హసీనాను కాపాడాయంటే అతిశయోక్తి కాదు. రెండు యుద్ధ విమానాలకు ఆమె హెలికాఫ్టర్ పై ఎలాంటి దాడులు జరగకుండా కాపు కాసి.. హిండన్ ఎయిర్ బేస్‌లో దిగేలా చేశాయి. 


హసీనా హెలికాఫ్టర్‌కు అప్పటికప్పుడు అనుమతులు


బంగ్లాదేశ్‌లో ఆందోళన కారులకు ఆర్మీ మద్దతు ప్రకటించిన తర్వాత పరిస్థితి మారిపోయింది. అధ్యక్షురాలు హసీనా ప్రాణానికి ముప్పు ఏర్పడింది. దీంతో అతి కష్టం మీద ఓ ఆర్మీ హెలికాఫ్టర్ లో ఆమె గమ్యం తెలియని ప్రాంతానికి గాల్లోకి ఎగిరారు. హెలికాప్టర్ నుంచే షేక్ హసీనా వెంట ఉన్న సిబ్బంది  భారత్ అధికారులను సంప్రదించారు. తాము భారత్ వైపు వస్తున్నామని చెప్పారు. బంగ్లాదేశ్‌తో.. షేక్ హసీనాతో  భారత్ కు మంచి అనుబంధం ఉంది. ఈ కారణంగా భారత్ లోకి అనుమతించాలని నిర్ణయించారు. అంతే కాదు.. ఆమెకు ముప్పు ఉందని గ్రహించి.. ఆమె ప్రయాణిస్తున్న  ఆర్మీ హెలికాప్టర్ కు రక్షణగా రఫేల్ జెట్స్ ను పంపాలని నిర్ణయించారు. 


ఆకాశంలో భద్రత కోసం రెండు రాఫేల్ జెట్స్             


షేక్ హసీనాకు ఆర్మీ మద్దతు లేకపోవడం ఆమె ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ కూడా ఆర్మీకి చెందినది కావడంతో .. ఎప్పుడైనా గాల్లో ఎటాక్ జరగవచ్చని అనుమానించారు. అందుకే భారత గగనతలంలోకి షేక్ హసీనా హెలికాఫ్టర్ ప్రవేశంచిన వెంటనే పూర్తి స్థాయిలో రక్షణ కల్పించారు. రాడార్‌తో ఆమె హెలికాప్టర్ పయనం ఎటు వైపు అన్నదాన్ని తెలియకుండా నియంత్రించారు. అలాగే.. రఫేల్ జెట్స్‌తో .. నితంతర పహారా కాశారు. యూపీలోని హిండన్ ఎయిర్ బేస్‌లో దిగే వరకూ రఫేల్ జెట్సే రక్షణగా నిలిచాయి. షేక్ హసీనా భద్రతపై భారత్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. 


భారత్ లో ఉండాలా లేదా అన్నదనిపై హసీనాదే నిర్ణయం                   


ప్రస్తుతం షేక్ హసీనా భారత్ లోనే ఉన్నారు. ఆమెకు రాజకీయ ఆశ్రయం ఇవ్వాలా వద్దా అన్నదనిపై కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆమెకు రాజకీయ ఆశ్రయం ఇవ్వడానికి కేంద్రం నిరాకరించిందని.. ఆమె లండన్ వెళ్లిపోతారన్న ప్రచారం జరిగింది. అయితే షేక్ హసీనా నిర్ణయం మేరకు తమ నిర్ణయం ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. షేక్ హసీనాకు ఆశ్రయం ఇస్తే.. బంగ్లాదేశ్‌తో ఏర్పడే కొత్త ప్రభుత్వంతో అనేక సమస్యలు వస్తాయని అంచనా వేస్తున్నారు. షేక్ హసీనా లండన్ వెళ్లాలనుకుంటే .. వెంటనే అంగీకరిస్తారని.. భారత్ లోనే రాజకీయ ఆశ్రయం కోరితే మాత్రం.. ఆలోచించే అవకాశం ఉందని చెబుతున్నారు.