Mumbai School Bus Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విహార యాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా పాఠశాల బస్సు బోల్తాపడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.
ఇదీ జరిగింది
ముంబయి చెంబూర్‌లో ఉన్న ఓ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో 10వ తరగతి చదువుతున్న 48 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు విహార యాత్ర కోసం లోనావాలా ప్రాంతానికి వెళ్లారు. ఆదివారం సాయంత్రం అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే రాత్రి 8 గంటల ప్రాంతంలో కొండ దిగుతుండగా బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు.. సంఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read: Watch Video: స్టీరింగ్ గాలికొదిలేసి కదులుతున్న కారులో పేకాట- వైరల్ వీడియో!