యష్ ఆదిత్యని జడ్జి దగ్గరకి తీసుకుని వస్తాడు. మాళవిక, వేద కూడా విషయం తెలుసుకుని కంగారుగా వస్తారు. వేదనే ఇదంతా చేసిందని మాళవిక యష్ కి చెప్తూ ఉంటుంది. బుద్ధి లేని వేద మన ఆదిని మనకి దూరం చెయ్యాలని చూస్తుందని వేద మీదకి వెళ్లబోతుంటే యష్ అడ్డుకుంటాడు. ఆదిని పోలీసులకి అప్పగించి జడ్జి దగ్గరకి తీసుకొచ్చింది వేద కాదు నేనే అని యష్ అంటాడు. ఆ మాటకి అందరూ షాక్ అవుతారు. కారు యాక్సిడెంట్ చేసింది ఆదిత్య అని జడ్జి గారికి చెప్పింది కూడా తనే అని ఒప్పుకుంటాడు. సాక్ష్యాధారాలు కూడా సబ్మిట్ చేసినట్టు చెప్తాడు.


యష్: పసి వయస్సులో చేయకూడదని తప్పు చేశాడు, నాకోసం వాడిని వేద వదిలేసింది. అది అలుసుగా తీసుకుని స్కూల్ లో పిల్లాడి మీద ఎటాక్ చేశాడు. ప్రిన్సిపల్ కి ఎదురు తిరిగాడు, నన్ను కాపాడటానికి మా డాడీ ఉన్నాడని అన్నాడు. ఈ వయస్సులో వాడిని కంట్రోల్ చేయకపోతే వాడు చెయ్యి దాటి పోతాడు అందుకే ఇలా చేశాను


మాళవిక: షటప్ యశోధర్.. బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావ్ ఏంటి. ఎంత ధైర్యం నీకు ణా కొడుకుని పోలీసులకి అప్పగిస్తావా. కారు మీద మోజు పడ్డాడు బర్త్ డే గిఫ్ట్ గా ఇచ్చాం, సరదాగా డ్రైవింగ్ చేశాడు, ఈ ముసలదీ అడ్డు వచ్చింది దెబ్బలు తగిలాయ్ అయితే ఏంటి, పిల్లాడిని కొడతాడు ఏమైంది, డబ్బులు పారేస్తాను


యష్: నువ్వు చేస్తున్న తప్పు ఇదే నా కొడుకు జీవితం నీలాగా కాకూడదు, వాడి జీవితం బాధ్యత నాది. చిన్నప్పుడు తప్పులు చేస్తే సరిదిద్దకపోతే నేరస్థులు అవుతారు, అందుకే సరిదిద్దాలని అనుకున్నా


Also Read:  చంద్రమ్మకి డబ్బులిచ్చి పంపించేసిన కార్తీక్,దీపలో మొదలైన అనుమానం


మాళవిక: అసలు డ్రామాలు ఆపు, నిన్ను వదిలేసి ఆ అభిమన్యు దగ్గరకి వెళ్లానని పగ తీర్చుకోవాలని అనుకున్నావ్ ఆదిని అడ్డం పెట్టుకుని పగ తీర్చుకోవాలని అనుకుంటున్నావ్


యష్: నీ మీద పగ తీర్చుకోవడం ఏంటి అంత సీన్ లేదు నీకు, నా కన్న కొడుకుని కోర్టుకి తీసుకొచ్చి అప్పగిస్తుంటే నరకం అనుభవించాను, ఈ శిక్ష ఆదికి కాదు నాకు నేను వేసుకున్న శిక్ష. నా లైఫ్ లో నీకు స్థానమే లేదు, నా ఆలోచన అంతా నా కొడుకు ఆదిత్య గురించే. ఈరోజు వాడికి నామీద కోపం రావొచ్చు, ఏదో ఒక రోజు నన్ను అర్థం చేసుకుంటాడు, నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని అర్థం అవుతుంది.


జడ్జి యష్ వాళ్ళని పిలుస్తాడు. అందరూ కలిసి తన కొడుకు మీద కుట్ర చేస్తున్నారని ఆదిని విడిచిపెట్టమని మాళవిక ఏడుస్తూ అడుగుతుంది. సాక్ష్యాధారాలు అన్ని పరిశీలించడం జరిగింది, మీ అబ్బాయి కారు యాక్సిడెంట్ చేశాడని నిర్ధారించామని జడ్జి చెప్తాడు. తన కొడుకు బదులు తనని జైలుకి పంపించమని యష్ జడ్జిని రిక్వెస్ట్ చేస్తాడు. చట్టానికి సెంటిమెంట్స్ ఉండవని జడ్జి చెప్తాడు. ఆదిత్యకి ఆరు నెలలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్తాడు. దీంతో ఆదిత్యని పోలీసులు జువైనల్ హోమ్ కి తరలించేందుకు తీసుకెళ్లిపోతారు. యష్ ఆదిత్యతో మాట్లాడటానికి ట్రై చేస్తే చీదరించుకుంటాడు. కాపాడతానని చెప్పి ఛీట్ చేశావని మాటలు అంటాడు.


Also Read: రిషిని ఆలోచనలో పడేసిన వసుధార ప్రవర్తన, వసుని ఇంటికి వెళ్లమని చెప్పిన జగతి


యష్ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. వేద వచ్చి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అడుగుతుంది. ‘నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం నువ్వే, నువ్వు అన్న మాటలు తర్వాత నేను తండ్రిగా ఆలోచించి ఇలా చేశాను, నీ మాటలు విన్న తర్వాత గట్టి పనిష్మెంట్ కావాలని జడ్జిని అడిగాను, కానీ ఆదిత్యకి ఇచ్చారు. చాలా రోజుల తర్వాత నా ఆదితో హేట్ యు చెప్పించుకున్నా కానీ బాధపడటం లేదు’ అని యష్ అంటాడు. మాళవిక వేదని ఆపుతుంది. ‘మంచిదానిలా నటిస్తూ యశోధర్ ని మాయ చేశావ్, నాకుతుర్ని లాగేసుకున్నావ్ ఇప్పుడు కొడుకుని లేకుండా చేశావ్. ఎప్పటికీ నువ్వు ఖుషికి తల్లిగానే మిగిలిపోతావ్ యశోధర్ కి భార్యవి కాలేవు’ అని ఛాలెంజ్ చేస్తుంది. అదంతా అటు మాలిని, సులోచన, యష్ వింటారు.  


తరువాయి భాగంలో..


యష్, వేద మాళవిక మాటల గురించి ఆలోచిస్తూ ఉంటారు. వేద నా ఖుషికి అమ్మ మాత్రమేనా అని అనుకుంటాడు. సులోచన, మాలిని కూడా దీని గురించే ఆలోచిస్తూ ఒక ప్లాన్ వేస్తారు. దీనికి పరిష్కారం సులోచన వేద వాళ్ళని తన అమ్మమ్మ వాళ్ళ దగ్గరకి పంపించాలని అనుకుంటుంది.