వసు, రిషి పానీపూరి తినడానికి వస్తారు. వసు పానీపూరి తింటూ గతంలో కొబ్బరి బొండాలు తాగిన విషయం గుర్తు చేసుకుంటుంది. ఏంటి ఆలోచిస్తున్నావ్ మనం కొబ్బరి బొండాలు తాగిన విషయం గుర్తుకు వచ్చిందా అని రిషి అడుగుతాడు. వసు మళ్ళీ పానీపూరి గురించి క్లాస్ తీసుకుంటుంటే బాబోయ్ వద్దని అంటాడు. వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకోవడం చూసి బండి అతను మీ పెళ్లెప్పుడు అని అడిగేస్తాడు. ఆ మాటకి ఇద్దరు ఆశ్చర్యంగా అలా అడిగావ్ ఏంటని అంటారు. గొడవలు పడకుండా నవ్వుతూ మాట్లాడుకుంటున్నారంటే మీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్న వాళ్ళని అర్థం అయ్యిందని అంటాడు.


రిషి దీని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మన పెళ్లి గురించి ఆలోచించాలని రిషి వసుతో చెప్తాడు. వసు బాధగా ఉంటే పెద్దమ్మతో మాట్లాడతాను అని రిషి ధైర్యం చెప్తాడు.


రిషి: మీ ఊరు, మీ వాళ్ళని గుర్తు చేస్తే చేదు జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. చదువు కోసం పెళ్లి పీటల మీద నుంచి ధైర్యంగా వచ్చేశావ్, అదే ధైర్యంతో వాళ్ళని మన పెళ్ళికి ఒప్పిస్తావని అనుకుంటున్నా


వసు: ఆడపిల్లకి పుట్టింటి వాళ్ళు అండగా ఉంటారు కానీ ఒక ఆడపిల్లగా తన తండ్రి తప్పులు చెప్పే పరిస్థితి ఎవరికి రాకూడదు. మా నాన్న మంచివాడు నా చదువు విషయం ఆయనకి ఇష్టం లేదు, ఆయన చెప్పిందే జరగాలి అంటారు. మా అమ్మ కూడా ఆయనకి ఎదురు చెప్పలేదు, నాన్న లేనప్పుడు అమ్మ ధైర్యం చెప్పేది ఆ ధైర్యమే పెళ్లి పీటల నుంచి బయటకి వచ్చేశాలా చేసింది. తను చెప్పిందే జరగాలని అనుకునే విచిత్ర మనస్తత్వాలు ఉన్న బావలు వచ్చారు. మా అమ్మ మా అక్కల జీవితాలు అయినట్టు నా జీవితం కాకూడదని ధైర్యం చెప్పి అమ్మ నన్ను బయటకి పంపించింది. అందరినీ వదిలేసి వచ్చాను, జగతి మేడమ్ మీలాంటి తోడు దొరికాక అనుకున్నది సాధించాను. అక్కడే ఉంటే అక్కడే నా జీవితం ముగిసిపోయేది ఏమో, నేను ఏం చెయ్యాలి, వాళ్ళని ఎలా ఒప్పించాలి అని ఏడుస్తుంది.


Also Read: కార్తీక్ ని చూసిన శౌర్య- కన్న కూతురి కోసం తల్లడిల్లిపోతున్న దీప


తన కన్నీళ్ళు చూసి రిషి బాధపడుతు కర్చీఫ్ ఇవ్వబోతుంటే వద్దని అంటుంది. రిషి వసు కన్నీళ్ళు తుడుస్తాడు. ప్రేమగా దగ్గరకి తీసుకుంటాడు. రిషి వాళ్ళు మంత్రి దగ్గరకి వెళతారు. మిషన్ ఎడ్యుకేషన్ అంటే ఇతర రాష్ట్రాల వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు, కానీ దానికి హెడ్ గా ఉండలేనని జగతి మెయిల్ చేశారు, తన స్థానంలో వసుధారని పెట్టమని సూచించినట్టు మంత్రి రిషి వాళ్ళకి చెప్తాడు. అటు జగతి కూడా తన దగ్గరకి వచ్చిన మేడమ్ వాళ్ళకి చెప్తుంది. ఇంత పెద్ద బాధ్యత మోయలేని వసు అంటుంది. కానీ రిషి మాత్రం జగతి మేడమ్ గైడెన్స్ లో వసుధార చేస్తుందని చెప్తాడు. ఇదే విషయం గురించి రిషి ఇంట్లో వాళ్ళకి చెప్తాడు.


జగతి మేడమ్ ప్లేస్ ని రీప్లేస్ చేసేంత గొప్ప దాన్ని కాదని వసు అంటుంది. మినిస్టర్ చెప్తే మాకు సరైనదే అని అనిపిస్తుందని మహేంద్ర కూడా ధైర్యం చెప్తాడు. దీని గురించి నువ్వేమి ఆలోచించకు మేడమ్ బాధ్యతలు నువ్వు తీసుకుంటున్నావని రిషి చెప్పేస్తాడు. వసు చిరాకుగా జగతి దగ్గరకి వస్తుంది. మిషన్ ఎడ్యుకేషన్ తను నడపలేనని వసు కంగారుపడుతుంది. తనకన్నా బాగా ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లగలవని జగతి ధైర్యం చెప్తుంది. అప్పుడే రిషి వసుని రమ్మని మెసేజ్ చేస్తాడు. ఎప్పుడు మీ మేడమ్ దగ్గరేనా నాకు కూడా కనిపించొచ్చు కదా అని రిషి వసుతో ముద్దుగా మాట్లాడతాడు.


Also Read: నాకోసమే దీప గుండె కొట్టుకుని కొట్టుకుని అలసిపోయింది, కన్నీళ్లు పెట్టించేసిన కార్తీక్, మళ్లీ శౌర్యకి అన్యాయం