కార్తీక్ దీపని సంతోషంగా ఉంచాలని అనుకుంటాడు. ఇంద్రుడు, చంద్రుడు దీప కంట పడకుండా జాగ్రత్త పడాలని అంటాడు. దీప టిఫిన్ రెడీ చేశానని చెప్పేసరికి ఎందుకు వంట చేశావ్ స్టవ్ దగ్గరకి వెళ్లొద్దని చెప్పాను కదా అని కార్తీక్ అంటాడు. ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. చంద్రమ్మ ఇంట్లోకి రావడం కార్తీక్ చూసి వెంటనే తన దగ్గరకి వెళతాడు. దీప ఎక్కడ చూస్తుందో అని కంగారుగా తనని పక్కకి తీసుకుని వెళ్ళిపోతాడు. ఎందుకు వచ్చావ్ అని కార్తీక్ అడుగుతాడు. మీ ఇల్లని తెలియక వచ్చానని చెప్తుంది. సరే ఇంకెప్పుడు ఇక్కడికి రావొద్దని చెప్తాడు. చంద్రమ్మమి డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు. తనని జాగ్రత్తగా చూసకోమని చెప్తాడు. శౌర్య మా ప్రాణం కన్నబిడ్డలాగా చూసుకుంటున్నామని చెప్తుంది.


సౌందర్య, ఆనందరావు దీప, కార్తీక్ గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళు బతికే ఉన్నారని సౌందర్య అంటుంటే ఆ అవకాశం లేదేమో అని ఆనందరావు అంటాడు. ఇన్ని సార్లు అక్కడికి వెళ్తున్నాం కానీ ఫలితం ఏమి లేదు కదా అని నిరుత్సాహంగా మాట్లాడతాడు. మోనిత ప్రవర్తన వల్లే కార్తీక్ వాళ్ళు బతికే ఉన్నారని అర్థం అవుతుందని, శౌర్యని కూడా ఇంద్రుడు వాళ్ళు అందుకే కదా అన్ని అడ్రస్ లు మారుస్తున్నారని సౌందర్య నమ్మకంగా చెప్తుంది. తను ఒక్కదాన్ని అయినా వెళ్ళి కార్తీక్ వాళ్ళని వెతికి ఇంటికి తీసుకొస్తానని సౌందర్య చెప్తుంది. ఇంద్రుడు, చంద్రమ్మ శౌర్య వాళ్ళ దగ్గరే ఉన్నందుకు సంతోషంగా ఉంటారు. శౌర్య ఇంద్రుడి, చంద్రమ్మతో కలిసి దిగిన ఫోటో కోసం వెతుకుటుంది. ఆ ఫోటో ఉంటే మా ఇంట్లో పెట్టుకుంటానని అంటుంది.


Also Read: నాకోసమే దీప గుండె కొట్టుకుని కొట్టుకుని అలసిపోయింది, కన్నీళ్లు పెట్టించేసిన కార్తీక్, మళ్లీ శౌర్యకి అన్యాయం


అటు దీప అదే ఫోటో పట్టుకుని ఏడుస్తుంది. ‘నా కూతుర్ని నా దగ్గర నుంచి దూరం చేశారు, మీకు నిజంగా నా బిడ్డ మీద ప్రేమ ఉంటే మమ్మల్ని కలిపి సంతోషంగా ఉండే వాళ్ళు’ అని దీప చాలా బాధపడుతుంది. శౌర్యని వెతకాలని మళ్ళీ అనుకుంటుంది. దీప పరిస్థితి తలుచుకుని కార్తీక్ కన్నీళ్ళు పెట్టుకుంటుంటే చారుశీల ధైర్యం చెప్పేందుకు ట్రై చేస్తుంది. తన మనసులో బాధ అంతా చారుశీల దగ్గర చెప్పుకుని వాపోతాడు. అసలు ఆ దేవుడు మమ్మల్ని ఎందుకు ప్రాణాలతో ఉంచాడో అర్థం కావడం లేదు, శౌర్య ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే ఎందుకు ఉంది, అమ్మ వాళ్ళు ఎందుకు తనని తీసుకెళ్లాడానికి రాలేదు అనే ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాలని అనుకుంటాడు. దీపని రక్షించుకోలేమా అని కార్తీక్ చాలా ఎమోషనల్ అవుతాడు.


దీప నిద్రలేచేసరికి ఇంటి ముందు ముగ్గులు పెట్టి ఉంటాయి. కార్తీక్ అదంతా చేశాడని అనుకుంటుంది. కానీ ఒకామె ఆ ముగ్గులు వేసింది తనే అని చెప్తుంది. కొత్త పని మనిషి హడావుడి చేస్తుంది. అసలు నువ్వు ఎవరని దీప అడుగుతుంది. మీ బాగోగులు చూసుకునే బాధ్యత తనదే అని ఆమె చెప్తుంది. మిమ్మల్ని చూసుకోమని చారమ్మ పంపించిందని చెప్తుంది.


Also Read: రిషిని ఆలోచనలో పడేసిన వసుధార ప్రవర్తన, వసుని ఇంటికి వెళ్లమని చెప్పిన జగతి


తరువాయి భాగంలో..


శౌర్య పూలు కోస్తూ కాలు జారి కింద పడుతుంది. చారుశీల హాస్పిటల్ కి తనని తీసుకొస్తారు. కార్తీక్ వచ్చి తనని ప్రేమగా చూస్తూ బాధపడతాడు. ప్రమాదం ఏమి లేదు కార్తీక్ అనగానే శౌర్య కళ్ళు తెరుస్తుంది.