Viral Video: సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. కొంతమంది యువకులు స్టీరింగ్‌ వదిలేసి కదులుతున్న కారులోనే పేకాట ఆడుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఎక్కడ జరిగిందో తెలియదు గానీ ఈ వీడియో మాత్రం వైరల్‌గా మారింది.


టెక్నాలజీ


వీడియోలో కనిపించిన కారు మహీంద్రా సంస్థ తీసుకొచ్చిన ఎక్స్‌యూవీ 700 (XUV 700) మోడల్‌కి చెందినది. ఈ కారులో అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెంట్‌ సిస్టమ్‌ (ఏడీఏఎస్‌) టెక్నాలజీ ఉంది. ఇది డ్రైవర్‌కు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ఉంటుంది. అనుకోకుండా ఏదైనా అడ్డువస్తే వెంటనే డ్రైవర్‌ని అలర్ట్‌ చేస్తుంది. ఆటోడ్రైవింగ్‌ వెసులుబాటు కూడా ఈ కారులో ఉంది.






ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని ఈ యువకులు ఇలా స్టీరింగ్‌ వదిలేసి కదులుతున్న కారులోనే జూదం ఆడటం మొదలు పెట్టారు. పైగా ఇందులో ఎవరూ సీట్‌ బెల్టు పెట్టుకోలేదు. డ్రైవింగ్‌ను పట్టించుకోవడం లేదు. ట్రాఫిక్‌ నిబంధనలను పాటించకుండా రోడ్డుపై ప్రయాణిస్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.


Also Read: Gujarat CM Oath-Taking: గుజరాత్‌ సీఎం ప్రమాణస్వీకారం- అతిథులుగా మోదీ సహా 20 మంది సీఎంలు