ABP  WhatsApp

MP Kanimozhi: ఖుష్భూ, నమితపై డీఎంకే నేత అసభ్యకర వ్యాఖ్యలు- కనిమొళి క్షమాపణలు!

ABP Desam Updated at: 28 Oct 2022 04:25 PM (IST)
Edited By: Murali Krishna

MP Kanimozhi: భాజపాలో ఉన్న సీనియర్ హీరోయిన్లు ఖుష్భూ, నమితపై డీఎంకే నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ఖుష్భూ, నమితపై డీఎంకే నేత అసభ్యకర వ్యాఖ్యలు- కనిమొళి క్షమాపణలు!

NEXT PREV

MP Kanimozhi: భాజపాలో చేరిన హీరోయిన్స్ ఖుష్భూ, నమిత, గౌతమి, గాయత్రి రఘురామన్‌లపై డీఎంకే నేత సాధైయ్ సాధిక్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం.. దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. దీంతో ఈ వ్యాఖ్యలపై డీఎంకే నాయకురాలు కనిమొళి.. బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.


అనుచిత వ్యాఖ్యలు


ఆర్కే నగర్‌లో ఇటీవల జరిగిన ఓ బహిరంగ సభలో డీఎంకే నేత సాధైయ్ సాధిక్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. భాజపాలో ఉన్న సీనియర్‌ నటీమణులు ఖుష్బూ, నమితా, గౌతమి, గాయత్రి రఘురామన్‌లు 'ఐటమ్‌'లు అంటూ వ్యాఖ్యానించారు.



తమిళనాడులో భాజపా బలపడుతుందని ఖుష్బూ చెబుతున్నారు. అమిత్‌షా తలపై వెంట్రుకలైనా మొలుస్తాయోమో కానీ తమిళనాడులో కమలం మాత్రం వికసించదు. డీఎంకేను నాశనం చేసి భాజపాని బలోపేతం చేసేందుకు ఈ ఐటమ్స్ ఉపయోగపడతారా? ఇది వారి వల్ల కాదు. -                                                             సాధైయ్ సాధిక్, డీఎంకే నేత


అంతటితో ఆగని సాధిక్.. ఖుష్భూపై రాయలేని భాషలో అసభ్య పదజాలాన్ని వినియోగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వ్యాఖ్యలపై భాజపా నేత ఖుష్భూ తీవ్రంగా స్పందించారు. ఇదేనా సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో కొత్త ద్రావిడ మోడల్ పాలన అంటూ విమర్శించారు.







పురుషులు స్త్రీలను దుర్భాషలాడటం.. అది వారి పెంపకం, వారు పెరిగిన విషపూరిత వాతావరణాన్ని అందరికీ తెలిసేలా చేస్తుంది. ఈ పురుషులు.. స్త్రీ గర్భాన్ని అవమానిస్తారు. అలాంటి పురుషులు  తాము కళైజ్ఞర్ అనుచరులుగా చెప్పుకుంటారు. ఇదేనా సీఎం ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో కొత్త ద్రావిడ నమూనా పాలన.                                  -  ఖుష్భూ, భాజపా నేత


క్షమాపణలు


ఖుష్భూ చేసిన ట్వీట్‌పై డీఎంకే నేత కనిమొళి స్పందించారు. ఖుష్బూకి క్షమాపణలు తెలియజేశారు.







మహిళలను కించపరుస్తూ మా పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఓ మనిషిగా, మహిళగా బహిరంగ క్షమాపణ చెబుతున్నాను. ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేసిన వారు ఎవరైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ పార్టీ వారైనా వాటిని సహించలేం. మా నాయకుడు సీఎం స్టాలిన్‌ గానీ, పార్టీ అధిష్టానం కానీ ఇలాంటి చర్యలను ఉపేక్షించదు.                                                  -  కనిమొళి, డీఎంకే నాయకురాలు 


Also Read: Delhi News: రోడ్డుపై చెలరేగిన గొడవ- ముగ్గురిని కారుతో ఢీ కొట్టి డ్రైవర్ పరార్!

Published at: 28 Oct 2022 04:20 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.