ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్ డీసీలో ఈ భేటీ జరిగింది. భారత్-ఆస్ట్రేలియా మధ్య బంధాన్ని మరింత మెరుగుపరుచుకోవడమే లక్ష్యంగా ఇరు దేశాధినేతల మధ్య చర్చలు జరిగినట్లు పీఎఓ తెలిపింది.
ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడం వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చించారని పేర్కొంది.
కొవిడ్ 19, వాణిజ్యం, రక్షణ సహా కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం మరింత పెంచేలా ఇరువురు చర్చించినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.
గ్లోబల్ సీఈఓలతో భేటీ..
అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ.. ఆ దేశానికి చెందిన 5 దిగ్గజ సంస్థల సీఈఓలతో భేటీ అయ్యారు. డిజిటల్ ఇండియా, 5జీ సాంకేతికత, రక్షణ, పునరుత్పాదక ఇంధన రంగం, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకోవాలని మోదీ.. సీఈఓలకు పిలుపునిచ్చారు.
క్వాల్కమ్ సీఈఓ క్రిస్టియానో ఆమోన్, అడోబ్ ఛైర్మన్ శంతను నారాయణ్, ఫస్ట్ సోలార్ సీఈవో మార్క్ విడ్మార్, జనరల్ అటామిక్స్ సీఈవో వివేక్‌లాల్, బ్లాక్‌స్టోన్ సీఈఓ స్టీఫెన్ ఎ ష్వార్జ్‌మెన్.. మోదీతో భేటీ అయినవారిలో ఉన్నారు.
Also Read:PM Modi US Visit: క్వాల్కమ్ సీఈఓ, అడోబ్ ఛైర్మన్‌తో మోదీ భేటీ.. 'డిజిటల్ ఇండియాకు' జై