Modi Surname Case:
మే 15 వరకూ స్టే
కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీకి కాస్త ఊరట లభించింది. మోదీ ఇంటిపేరుపై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై పట్నా హైకోర్టు స్టే విధించింది. మే 15 వరకూ స్టే విధిస్తున్నట్టు వెల్లడించింది. బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ పిటిషన్‌తో ఈ కేసు తెరపైకి వచ్చింది. దీనిపై విచారణ చేపట్టిన పట్నా హై కోర్టు స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే సూరత్ కోర్టులో ట్రయల్‌లో ఉన్న కేసుపై కింది కోర్టుల్లో ప్రొసీడింగ్స్ అవసరం లేదని తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ కౌన్సిల్ కూడా వెల్లడించింది.
"మేం క్వాషింగ్ పిటిషన్ వేశాం. ఇప్పటికే సూరత్ కోర్టులో ఈ అంశంపై విచారణ జరుగుతోంది. అలాంటప్పుడు మరో కోర్టులోనూ విచారణ ఎలా చేస్తారు..? ఇది అనైతికం. మే 15 మరోసారి విచారణ చేస్తామని పట్నా కోర్టు వెల్లడించింది. అప్పటి వరకూ కింది కోర్టుల్లో విచారణ జరపకుండా స్టే విధించింది. రాహుల్ పిటిషన్‌ను పట్నా హైకోర్టు అంగీకిరించింది. స్టే ఇచ్చి ఊరటనిచ్చింది. పట్నాలోని కింది కోర్టులో హాజరయ్యే అవసరం ఇకపై రాహుల్‌కి ఉండదు"
- రాహుల్ గాంధీ కౌన్సిల్
బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ కౌన్సిల్ రాహుల్‌పై పిటిషన్ వేసింది. ఏప్రిల్ 12న పట్నాకోర్టులో రాహుల్ హాజరు కావాలని తేల్చి చెప్పింది. అయితే ఈలోగా పట్నా హైకోర్టు స్టే విధించింది.
రాహుల్ గాంధీపై అనర్హతా వేటు పడినప్పటి నుంచి "న్యాయ పోరాటం" చేస్తానంటూ గట్టిగానే చెబుతూ వచ్చారు. పైకోర్టులో తేల్చుకుంటామని ఇప్పటికే కాంగ్రెస్ కూడా పలు సందర్భాల్లో తేల్చి చెప్పింది. సూరత్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పుని సవాలు చేస్తూ రాహుల్ పిటిషన్ వేశారు. ఈ క్రమంలోనే రాహుల్‌కి కోర్టు షాకిచ్చింది. ఈ పిటిషన్ కొట్టేసింది. విచారించడం కుదరదని తేల్చి చెప్పింది. మోదీ ఇంటి పేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఆయనను దోషిగా తేల్చుతూ సూరత్ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. ఈ తీర్పుపై స్టే విధించాలని రాహుల్ పిటిషన్ వేయగా...దాన్ని తిరస్కరించింది. అంతకు ముందు రాహుల్ గాంధీ కోర్టుపై ఆరోపణలు చేశారు. ట్రయల్ కోర్టు తనతో చాలా దురుసుగా ప్రవర్తించిందని విమర్శించారు. ఏప్రిల్ 3వ తేదీన సెషన్స్ కోర్టుని ఆశ్రయించారు. రాహుల్ తరపున న్యాయవాదులు రెండు పిటిషన్‌లు వేశారు. జైలు శిక్షపై స్టే విధించేందుకు ఓ పిటిషన్, అప్పీల్ చేసుకునేంత వరకూ శిక్షపై విధించాలని మరో పిటిషన్ వేశారు.
Also Read: Watch Video: ఫ్రీగా చీరలిస్తామంటూ కంపెనీ ఆఫర్, ఓ శారీ కోసం కొట్టుకున్న మహిళలు - వైరల్ వీడియో