ABP  WhatsApp

Mann Ki Baat Highlights: చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు- ప్రకటించిన మోదీ

ABP Desam Updated at: 25 Sep 2022 01:40 PM (IST)
Edited By: Murali Krishna

Mann Ki Baat Today Highlights: చండీగఢ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు పెట్టనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

(Image Source: PTI)

NEXT PREV

Mann Ki Baat Today Highlights: చండీగఢ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌ సింగ్‌ పేరు పెట్టనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మన్‌ కీ బాత్‌లో ఈ విషయాన్ని మోదీ వెల్లడించారు.



గొప్ప స్వతంత్ర సమరయోధుడికి నివాళులర్పించటంలో భాగంగా చండీగఢ్‌ ఎయిర్‌పోర్ట్‌కు షాహీద్‌ భగత్‌ సింగ్‌ పేరు పెట్టాలని నిర్ణయించాం. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో సెప్టెంబర్‌ 28 ఒక ముఖ్యమైన రోజు. ఆ రోజున భగత్‌ సింగ్‌ జయంతిని ఘనంగా నిర్వహిస్తాం. ఆయనకు నివాళి అర్పించడానికే చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌కు భగత్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించాం.                                             -   ప్రధాని నరేంద్ర  మోదీ
                                                           


అతి పెద్ద ముప్పు 


వాతావరణ మార్పులు సహా పలు అంశాలపై మన్‌ కీ బాత్‌లో మోదీ మాట్లాడారు. వాతావరణ మార్పు అనేది మానవకోటికి అతిపెద్ద ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవాళ్లను ఎదుర్కోవటంలో నిరంతరం కృషి చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.


చీతాలు


ఇటీవల భారత్‌కు చేరుకున్న చీతాలు.. 130 కోట్ల ప్రజలకు గర్వకారణమని మోదీ అన్నారు. టాస్క్‌ఫోర్స్‌ వాటి పర్యవేక్షణ బాధ్యతలు చేపడుతోందని, ప్రజల సందర్శన అనుమతులపై వారే నిర్ణయం తీసుకంటారని చెప్పారు. 



దశాబ్దాల తర్వాత చీతాలు తిరిగి భారత్​లో అడుగుపెట్టడం 130 కోట్ల భారతీయులకు గర్వకారణం. ప్రస్తుతం చీతాలు టాస్క్​ఫోర్స్ పర్యవేక్షణలో ఉన్నాయి. త్వరలోనే వాటిని చూసేందుకు ప్రజలను అనుమతిస్తారు. చీతాలకు ప్రజలు కొత్త పేర్లు సూచించాలి. అలాగే జంతువుల పట్ల మనుషులు ఎలా ప్రవర్తించాలనే విషయంపైనా సూచనలు ఇవ్వాలి. ఈ పోటీలో పాల్గొన్నవారికి మొదట చీతాలను చూసే అవకాశం కల్పిస్తాం.                                     -  ప్రధాని నరేంద్ర మోదీ


మాన్ కృతజ్ఞతలు



మొహాలీ-చండీగఢ్ విమానాశ్రయానికి షహీద్ భగత్ సింగ్ పేరు పెట్టాలని హరియాణా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా, నేనూ.. విమానయాన మంత్రిత్వ శాఖకు లేఖ పంపాం. భగత్ సింగ్ జయంతికి ముందే ఆయన పేరు పెట్టాలని కోరాం. 'మన్ కీ బాత్'లో ప్రధాన మంత్రి మోదీ.. చండీగఢ్ విమానాశ్రయానికి పేరు మార్చినట్లు ప్రకటించారు. దీనికి ధన్యవాదాలు -                      భగవంత్ మాన్, పంజాబ్ సీఎం 


Also Read: Iran Protest: హిజాబ్‌ ఆందోళనలు ఉద్ధృతం- 50 మంది వరకు మృతి!


Also Read: Lok Sabha Election 2024: సోనియా గాంధీతో నితీశ్, లాలూ భేటీ- టార్గెట్ 2024పై చర్చ!

Published at: 25 Sep 2022 01:22 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.