అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. శ్వేతసౌధం ఇందుకు వేదికైంది. తనకు ఘన స్వాగతం పలికినందుకు ప్రధాని మోదీ.. బైడెన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
2014, 2016లో మీతో జరిగిన భేటీని గుర్తుచేసుకున్నాను. భారత్- అమెరికా మధ్య బలమైన బంధం కోసం మీరు నాతో ప్రణాళికలు పంచుకున్నారు. ఆ ప్రణాళికలను ఇప్పుడు మీరు అమలు చేయడం ఆనందంగా ఉంది. ఈరోజు జరిపిన ద్వైపాక్షిక చర్చలు చాలా ముఖ్యం. ఈ శతాబ్దపు మూడో దశాబ్దం మొదట్లోనే మన చర్చలు జరిగాయి. మీ నాయకత్వం.. ఈ దశాబ్దంలో కీలక మార్పులు తెస్తుందని నమ్ముతున్నాను. భారత్- అమెరికా బంధాన్ని మరింత బలోపేతం చేద్దాం - ప్రధాని నరేంద్ర మోదీ
వాణిజ్యం కీలకం..
భేటీలో భాగంగా భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి గురించి బైడెన్ ప్రస్తావించారు. గాంధీ ఎప్పుడూ నమ్మకం, విశ్వాసం గురించి మాట్లాడేవారని.. రానున్న రోజుల్లో ప్రపంచానికి ఇవి చాలా ముఖ్యమని మోదీ అన్నారు.
భారత్- అమెరికాలు ఒకరిపై ఒకరు చాలా విషయాల్లో ఆధారపడి ఉంటాయి. అయితే ఇందులో వాణిజ్యం చాలా కీలకం. ఈ దశాబ్దంలో ఇదే ముఖ్యపాత్ర పోషిస్తుంది. - ప్రధాని నరేంద్ర మోదీ
మరింత బలంగా..
అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్- అమెరికా స్నేహం చాలా కీలకం. 2020 నాటికి ఇరుదేశాల మధ్య స్నేహం మరింత బలపడుతుందని 2006లో ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే చెప్పాను. మోదీజీ.. మన బంధాన్ని మరింత బలోపేతం చేద్దాం. - జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన అనంతరం మోదీతో నేరుగా బైడెన్ సమావేశం కావడం ఇదే తొలిసారి. క్వాడ్ సదస్సులోనూ ఇరువురు నేతలు పాల్గొననున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఎదుర్కొంటున్న సవాళ్ల క్వాడ్ దేశాల అధినేతలు చర్చించనున్నారు.
Also Read: Modi US Visit LIVE: మోదీకి ఘన స్వాగతం.. బైడెన్‌తో ద్వైపాక్షిక చర్చలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి