ABP  WhatsApp

UP Election 2022: యోగికి షాక్ మీద షాక్! అఖిలేశ్ ఫుల్ జోష్.. భాజపాకు మరో మంత్రి రాంరాం!

ABP Desam Updated at: 12 Jan 2022 06:10 PM (IST)
Edited By: Murali Krishna

ఉత్తర్‌ప్రదేశ్‌ కేబినెట్‌ నుంచి మరో మంత్రి రాజీనామా చేశారు. ఇప్పటికే ఒకరు రాజీనామా చేయగా తాజాగా ధారా సింగ్ చౌహాన్ బయటకు వస్తున్నట్లు తెలిపారు.

యోగి ఆదిత్యనాథ్‌కు షాక్

NEXT PREV

ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపాకు షాక్ మీద షాక్ తగులుతోంది. ఇప్పటికే ఒక మంత్రి సహా నలుగురు ఎమ్మెల్యేలు భాజపాను వీడిపోగా తాజాగా మరో ఓబీసీ మంత్రి పార్టీకి రాంరాం చెప్పారు. ధారా సింగ్ చౌహాన్.. యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌ నుంచి వైదొలిగారు.



యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌లో నాకు అప్పగించిన అటవీ, పర్యావరణ శాఖ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పని చేశాను. కానీ నేడు కేబినెట్‌ పదవికి రాజీనామా చేయడానికి ఒకే ఒక కారణం.. వెనుకబడిన వర్గాలు, దళితులు, రైతులు, నిరుద్యోగ యువతను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడమే.                                                                    - ధారా సింగ్ చౌహాన్


ఈ మేరకు ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌కు రాసిన రాజీనామా లేఖలో ధారా సింగ్ పేర్కొన్నారు. ఇప్పటికే ఒక మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య తన పదవికి రాజీనామా చేశారు.



అఖిలేశ్‌ స్వాగతం..



 

ధారా సింగ్ చౌహాన్ రాజీనామా చేసిన కాసేపటికే ఆయన పాటు ఉన్న ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేసి పార్టీలోకి ఆహ్వానించారు అఖిలేశ్ యాదవ్.

 


శ్రీ ధారా సింగ్ చౌహాన్‌ జీ కి సమాజ్‌వాదీ పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నాను. సామాజిక న్యాయం కోసం అలుపెరగకుండా ఆయన పోరాడారు. ఇప్పుడు సమాజ్‌వాదీ పార్టీ, మిత్ర పక్షాలు కలిసి.. సామాజిక న్యాయం కోసం ఐకమత్యంగా పోరాడతాయి. వివక్షను అంతమొందిస్తాం. అందరినీ గౌరవిద్దాం.. అందరికీ అవకాశమిద్దాం.                                                     - అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత
 


ఇద్దరు భాజపా గూటికి..


మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే నరేశ్ సైని, సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే హరి ఓం యాదవ్ ఈరోజు భాజపాలో చేరారు. వీరిద్దరూ వెనుకబడిన వర్గాలకు చెందిన నేతలే. డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మ, యూపీ భాజపా చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్ సమక్షంలో వీరు పార్టీలో చేరారు. 


Also Read: UP Election 2022: భాజపాకు 4 గంటల్లో ఐదుగురు ఎమ్మెల్యేలు బైబై.. సైకిల్ ఎక్కి రయ్‌ రయ్.. రసవత్తరంగా యూపీ రాజకీయం!


Also Read: ABP CVoter Survey: యూపీకి యోగి, ఉత్తరాఖండ్‌కు హరీశ్ రావత్.. సీఎంలుగా వీళ్లే కావాలట!


Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి




Published at: 12 Jan 2022 06:02 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.