Microsoft Outage: మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్ సర్వీసెస్‌లో సాంకేతిక సమస్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా పలు సేవలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఫ్లైట్‌ సర్వీస్‌లన్నీ స్తంభించిపోయాయి. భారత్‌తో సహా ప్రపంచ దేశాల్లోని విమానాలు ఆలస్యం అవడంతో పాటు కొన్ని రద్దు కూడా అయ్యాయి. ఢిల్లీ, ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఫ్లైట్ ఆపరేషన్స్‌కి సమస్యలు ఎదురయ్యాయి. తమ ఆన్‌లైన్ సర్వీస్‌లు తాత్కాలికంగా నిలిచిపోయాయని Akasa Airlines ప్రకటించింది. ముంబయి, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ల వద్ద ఈ సర్వీస్ పూర్తిగా పని చేయలేదు. టెక్నికల్ గ్లిచ్ కారణంగా బుకింగ్‌తో పాటు చెకిన్, మేనేజ్ బుకింగ్ సర్వీస్‌లకు అంతరాయం కలిగినట్టు వెల్లడించింది. స్క్రీన్‌పై ఎర్రర్ మెసేజ్ కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఆన్‌లైన్‌లో కాకుండా మాన్యువల్‌గా చెకిన్‌, బోర్డింగ్ చేస్తున్నట్టు తెలిపింది. ఇదే సమయంలో మరో ప్రకటన కూడా చేసింది. ఆన్‌లైన్ సర్వీస్‌లు పని చేయడం వల్ల ప్రయాణికులు చెకిన్‌ టైమ్‌కి ఇంకాస్త ముందుగానే రావాలని తెలిపింది. ఈ అంతరాయానికి క్షమాపణలు చెప్పింది. స్పైస్‌జెట్‌ కూడా ఇదే సమస్య ఎదుర్కొంది. పలు ఫ్లైట్స్‌ రద్దయ్యాయి. మరి కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ సమస్యని పరిష్కరించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్టు Spicejet ఓ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇండిగో సేవలకూ అంతరాయం కలిగింది. 






భారత్‌తో పాటు మరి కొన్ని దేశాల్లోనూ ఏవియేషన్ ఆపరేషన్స్ ఆగిపోయాయి. అమెరికాలోని  Frontier Airlines ఫ్లైట్స్ దాదాపు రెండు గంటల పాటు ఎయిర్‌పోర్ట్‌కే పరిమితమయ్యాయి. బుకింగ్స్‌పై తీవ్ర ప్రభావం పడిందని వెల్లడించింది. అయితే...ఈ గందరగోళంపై మైక్రోసాఫ్ట్ కీలక ప్రకటన చేసింది. ఉన్నట్టుండి ఈ సాంకేతిక సమస్య తలెత్తిందని తెలిపింది. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకే ప్రయత్నిస్తున్నామని వివరించింది. స్టాక్‌మార్కెట్‌పైనా ఈ ప్రభావం పడింది. ఈ ఘటనపై ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ సంస్థ విచారణ జరుపుతోంది. క్లౌడ్ స్ట్రైక్ అప్‌డేట్ కారణంగా ఈ సమస్య తలెత్తిందని ప్రాథమికంగా గుర్తించింది. క్లౌడ్ స్ట్రైక్ అప్‌డేట్‌లో బగ్ కారణంగా విండోస్ ఆపరేటింగ్ సిస్టం వాడుతున్న డెస్క్ టాప్ సిస్టమ్స్, ల్యాప్ టాప్స్ ప్రభావితమైనట్టు వెల్లడించింది. అయితే..ఈ ఎఫెక్ట్‌ తమపై లేదని SBI ప్రకటించింది. ఈ సమస్యపై కేంద్రం స్పందించింది. ఇందుకు కారణమేంటో గుర్తించినట్టు తెలిపింది. 




Also Read: Ratna Bhandar: రత్న భాండాగారంలో రహస్య సొరంగం! అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో సర్వే చేపడుతున్న ASI