Rizwan Sajan Dubai Richest Indian : గల్ఫ్ దేశాల్లో భారతీయులు చాలా మంది స్థిరపడ్డారరు. భారీగా సంపాదించి ఉంటారు. ఇలా సంపాదించిన వారిలో అత్యంత ముఖ్యుడు రిజ్వాన్ సాజన్ .  దుబాయ్ భారతీయుల్లో అత్యంత ధనవంతుడు. ఆయన ముంబై మురికివాడల్లో పుట్టి గల్ఫ్ లో తిరుగులేని ధనవంతుడిగా ఎదిగారు. ఆయన ఆస్తి ప్రస్తుతం ఇరవై వేల కోట్లపైనే.      


డాన్యూబ్ గ్రూప్ యజమాని రిజ్వాన్                


డాన్యూబ్ గ్రూప్. ఈ గ్రూప్ గురించి మన దేశంలో పెద్దగా తెలియదు. మాల్స్ లో డాన్యూస్ ఫర్నీచర్, హోల్ డెకార్స్ భారీ షోరూంలో ఉంటాయి. ఈ డాన్యూబ్ గ్రూప్ మిడిల్ ఈస్ట్ లో హోమ్ డెకార్ దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ వరకూ అనేక రకాల వ్యాపారాలు చేస్తుంది. ఈ సంస్థ ఇప్పుడు దుబాయ్‌లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రియల్ ఎస్టేట్  డెవలపర్. ఈ సంస్థ యజమానే రిజ్వాన్ సాజన్. ఆయనకు తండ్రి నుంచి వచ్చిన వ్యాపారాన్ని నిర్వహించడం లేదు. అది ఆయనే స్థాపించారు. ముంబై మురికివాడల్లో పెట్టి మొదట పాల ప్యాకెట్లు అమ్మి.. బాల కార్మికుడిగా కువైట్ కు వెళ్లి.. అంచెలెంచలుగా ఎదిగారు.            


శర్మ ఫ్యామిలీ కాదు పాకిస్తాన్ కుటుంబం - బెంగళూరులో పోలీసులకు చిక్కిన అనుమానితులు


ముంబై మురికవాడలో పుట్టి గల్ఫ్ లో ఉపాధి, వ్యాపారం                               


ముంబైలోని ఘట్కోపర్‌లో దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రిజ్వాన్ సాజన్ పేదరికం వల్ల చిన్నతనంలో చాలా కష్టాలు పడ్డాడు. పాలుకూడా అమ్మాడు. తండ్రి చనిపోవడంతో పదహారేళ్ల వయసులో బంధువుల దగ్గర పని చేయడానికి కువైట్ వెళ్లాడు. ప్రతి విషయంలోనూ వ్యాపారకోళం చూసేవాడు. కువైట్‌లోఎనిమిదేళ్లు ఉన్న  తర్వాత దుబాయ్ వచ్చాడు. అక్కడ ఎన్నో పనులు చేశాడు. అయితే అవేమీ పనులు కాదు. చిరు వ్యాపారాలు. చివరికి 1993లో డాన్యూబ్ గ్రూప్ ను ప్రారంభించిన తర్వాత ఆయన రాత మారిపోయింది. ఆ గ్రూపు విజయవంతంగా మిడిల్ ఈస్ట్ మొత్తం విస్తరించింది.  


స్టార్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో అనుపమ్ ఖేర్ ఫోటోతో కరెన్సీ - బంగారం వ్యాపారి బలైపోయాడు !


దుబాయ్ లో ఇప్పుడు రిజ్వాన్ కు ఉండే విలాసమే వేరు !                         


డాన్యూబ్ గ్రూప్ టర్నోవర్ ఇప్పుడు వేల కోట్లకు చేరుకుంది. ఇప్పుడు రిజ్వాన్ వ్యక్తిగత సంపద ఇరవై వేల కోట్లు ఉంటుందని అంచనా. దుబాయ్ లో అత్యంత లగ్జరీగా ఉండే అతి పెద్ద ప్యాలెస్ లో నివాసం ఉంటారు. అత్యంత ఖరీదైన కార్లు ఆయన కోటలో ఉంటాయి. ముంబై మురికివాడల నుంచి తన పయనం ఎలా వచ్చిందో ఆయన ఎప్పుడూ గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు.