Meet Asia's richest village Madhapur :  మాదాపూర్ అంటే మనకు తెలిసింది హైదరాబాద్‌లోని  హైటెక్ సిటీ ఉండే ప్రాంతం.  ఆ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత రిచ్ అని ఎవరైననా చెబితే కావొచ్చనుకుంటాం. కానీ మాదాపూర్ ఇప్పుడు విలేజ్ కాదు. సిటీలో కలిసిపోయింది. కానీ మరో మాదాపూర్ మాత్రం.. విలేజ్ గానే ఉంది. అంతే ప్రపంచంలోనే అత్యంత రిచ్ విలేజ్ గా కూడా పేరు తెచ్చుకుంది. అది పేరులో ఉండే మాహత్మ్యం ఏమో కానీ.. ఈ మాదాపూర్ మాత్రం గుజరాత్ లో ఉంటుంది. 


గుజరాత్ భుజ్ ప్రాంతంలో మాదాపూర్ గ్రామం                            


గుజరాత్ లోని  భుజ్ ప్రాంతంలో మాదాపూర్ అనే విలేజ్ ఉంటుంది. ఆ గ్రామంలో మొత్తం జనాభా 32 వేల మంది ఉంటారు. కానీ ఆ గ్రామంలో పదిహేడు బ్యాంక్ శాఖలు ఉన్నాయి.  ప్రైవేటు, ప్రభుత్వ రంగంలోని ప్రముఖ బ్యాంకులన్నీ ఆ 32వేల మంది  ఉన్న గ్రామంలో తమ శాఖలు ఏర్పాటు చేశాయి.  ఎందుకంటే వారికి అంత బిజినెస్ జరుగుతుంది మరి. మొత్తంగా ఆ గ్రామస్తులు ఇప్పటికే ఏడు వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో జమ చేశారు. 


32వేల జనాభాకు 17 బ్యాంక్  బ్రాంచ్‌లు                       


అయితే ఆ గ్రామంలో వారు వ్యవసాయం చేసి బంగారం పడింంచి..ఈ డబ్బులు సంపాదించడం లేదు. వారి సక్సెస్ సీక్రెట్ వారి పిల్లలే. ఆ గ్రామంలో ప్రతి ఇంటి నుంచి ఒకరు కాదు.. ముగ్గురు నలుగురు విదేశాల్లో స్థిరపడ్డారు. అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఇలా అనేక దేశాల్లో కీలక పొజిషన్లలో ఉన్నారు. వారంతా తమ కుటంబాల కోసం.. అక్కడ సంపాదించుకుని ఇక్కడకు పంపుతూ ఉంటారు. ఇక్కడి పెద్దలు.. అలా పంపిన మొత్తాన్ని బ్యాంకుల్లో జమ చేసేస్తూంటారు. ఆ గ్రామం నుంచి ఆఫ్రికాకు వెళ్లి అక్కడ నిర్మాణ రంగ వ్యాపారాలు చేస్తున్న వారు కూడా తమ కుటుంబాల కోసం పెద్ద ఎత్తున నగదు పంపిస్తూ ఉంటారు.


గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకున్న ప్రజలు                           


బాగా డబ్బు వస్తుందని అక్కడి ప్రజలు విచ్చలవిడిగా ఏమీ ఖర్చు పెట్టరు. మామూలుగానే జీవనం సాగిస్తూంటారు. గ్రామానికి ఏమైనా సమస్యలు ఎదురైతే సొంతంగా పరిష్కరించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తారు. మొత్తం ఇరవై వేల కుటుంబాలు గ్రామంలో ఉంటే.. అందులో పన్నెండు వందల కుటుంబాలు విదేశాల్లో భారీ వ్యాపారాలు, ఉద్యోగాల్లో కీలకంగా ఉన్నాయి. వారంతా గ్రామంలో స్కూళ్లకు.. మౌలిక సదుపాయాల కోసం సాయం కూడా చేస్తూంటారు. మట్టి వాసనలు పోకుండా తమ గ్రామాన్ని రక్షించుకుంటూ.. అత్యంత రిచ్ విలేజ్ గా మాదాపూర్ ను అక్కడి ప్రజలు మార్చుకున్నారు.