Mann Ki Baat 100th Episode:


రూ. 100 కాయిన్ విడుదల


మన్‌ కీ బాత్‌ 100వ ఎపిసోడ్ సందర్భంగా ప్రధాని మోదీ దేశానికి ఓ గిఫ్ట్ ఇవ్వనున్నారు. రేపు (ఏప్రిల్ 30) మన్‌ కీ బాత్ 100 వ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ సమయంలోనే ప్రధాని రూ.100 కాయిన్ విడుదల చేయనున్నారు. ఈ కాయిన్‌లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. దీనిపై మైక్రోఫోన్‌ సింబల్ ఉంటుంది. దీంతో పాటు 2023 అని ప్రింట్ చేసి ఉంటుంది. ఈ మేరకు అధికారికంగా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం ఒక్క కాయిన్‌ని మాత్రమే ప్రింట్ చేయనున్నారు. ఈ కాయిన్‌ సైజ్ 44 MM. వెండి, రాగి, నికెల్, జింక్‌తో దీన్ని తయారు చేశారు. కాయిన్ ముందు అశోక స్తంభం  కనిపించనుంది. దాని కింద సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది. ఓ వైపు India అని ప్రింట్ చేయనున్నారు. రూపీ సింబల్‌ కూడా ఉంటుంది. మైక్రోఫోన్‌ సింబల్‌తో పాటు సౌండ్ వేవ్స్‌ సింబల్‌ కూడా ప్రింట్ చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో 'Mann Ki Baat 100' అని ప్రింట్ చేయనున్నారు. ఈ కాయిన్ బరువు 35 గ్రాములు. 


గతంలోనూ 


ఇప్పుడే కాదు. రూ.100 కాయిన్‌లు గతంలోనూ చాలా సందర్భాల్లో ప్రింట్ చేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ స్మారకార్థం గతంలో ప్రధాని నరేంద్ర మోదీ 100 రూపాయల కాయిన్‌ విడుదల చేశారు. రాజ్‌మాత విజయ్‌రాజ్ సిందియా శత జయంతి సందర్భంగా కూడా రూ.100 కాయిన్‌ విడుదల చేశారు. మహారాణ ప్రతాప్ 476వ జయంతి సందర్భంలోనూ ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఓ కాయిన్ ప్రింట్ చేసింది. 2010, 2011,2012, 2014, 2015లో ఇలాంటి కాయిన్స్ ప్రింట్ చేయించింది కేంద్రం. ఈ సారి 100వ ఎపిసోడ్‌ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది కేంద్రం. దాదాపు లక్ష బూత్‌ల వద్ద ఈ కార్యక్రమాన్ని ఎయిర్ చేయనున్నారు. కొన్ని చోట్ల అధికారులు ఇంటింటికీ వెళ్లి ఈ కార్యక్రమంపై అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. 


Also Read: Mamata Banerjee: దేశాన్ని విడదీసే కుట్రల్ని తిప్పికొడతా, ప్రాణాల్ని కూడా లెక్క చేయను - బీజేపీపై మమతా ఫైర్