రంజాన్‌ పర్వదినం సందర్భంగా మసీదులు, ఈద్గాల్లో ముస్లింలు ప్రార్థనలు చేస్తున్నారు. ప్రార్థనల్లో భారీ సంఖ్యలో ముస్లిం పాల్గొంటున్నారు. పండగ వేళలో ట్రాఫిక్ జామ్‌లు లేకుండా హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. పాతబస్తీ, మిరాలం ఈద్గా, చార్మినార్‌, మాసబ్ ట్యాంక్‌, సింకిద్రాంబాద్‌, రాణిగంజ్‌ పరిసరప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. 


ముస్లింలకు ప్రముఖుల శుభాకాంక్షలు 


దేశవ్యాప్తంగా ఈద్ వేడుకలు జరుగుతున్నాయి.





రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.  ఈద్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ మన సమాజంలో సామరస్యం, కరుణ స్ఫూర్తి మరింత పెరగాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను అని ట్వీట్ చేశారు. 






ఈద్‌-ఉల్‌-ఫితర్‌ సందర్భంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం పాట్నాలోని గాంధీ మైదానంలో ప్రార్థనలు చేశారు. ఇటుకను అందించిన ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా అందరికీ ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. 'ఈద్ ముబారక్, ఈ పవిత్రమైన పండుగ అందరికీ శాంతి, సంతోషం, శ్రేయస్సును తీసుకురావాలి.






రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా దేశ ప్రజలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. 'ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా, నేను తోటి పౌరులందరికీ, ముఖ్యంగా భారతదేశం, విదేశాల్లోని ముస్లిం సోదర సోదరీమణులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రేమ, కరుణ పండుగ అయిన ఈద్, ఇతరులకు సహాయం చేయాలనే సందేశాన్ని ఇస్తుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని సమాజంలో సోదరభావం, పరస్పర సామరస్యాన్ని పెంపొందించే మార్గంలో ముందుకు సాగాలని మనమందరం సంకల్పిద్దాం.






ముస్లింలకు తెలంగాణ గవర్నర్‌ తమిళి సై కూడా ఈద్‌-ఉల్‌-ఫితర్‌ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర ఖురాన్‌ బోధనలు సమాజాన్ని తీర్చిదిద్దాయన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ముస్లింలకు రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు చెప్పారు. రంజాన్‌ ఉపవాస దీక్షలతో క్రమశిక్షణ, దైవభక్తి పరిఢవిల్లుతోందన్నారు. సామరస్యానికి, సుహృద్భావానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక రంజాన్‌ పండుగ. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ ఇది. అల్లాహ్‌ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదర, సోదరీమణులందరికీ ఈద్‌ ముబారక్‌ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.