పచ్చి చికెన్, ఫ్రీజ్ చేయని మయోన్నైస్, ఉడకని కొన్ని కూరగాయలు తింటే ఫుడ్ పాయిజనింగ్ అవుతుందని చాలా మందికి తెలుసు. కానీ బియ్యంతో వండిన అన్నం తిన్నా కూడా ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. జీర్ణాశయాంతర సమస్యలను కలిగిస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో మిగిలిపోయిన అన్నం తినడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నట్టు చూపించే వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. ఇది చూసి నిజంగానే మిగిలిపోయిన అన్నం తింటే ప్రమాదకరమా అని అనుమానం రేకెత్తుతుంది. అయితే అది వాస్తవం కాదని అన్నం మరొక విధంగా నిల్వ చేస్తే ఎటువంటి ప్రమాదం ఉండబోదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.


అన్నం వండిన తర్వాత కొన్ని గంటలకు బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. అన్నం వేడి చేసిన తర్వాత కూడా అందులో అవి జీవించే ఉంటాయని నిపుణులు వెల్లడించారు. అయితే గది ఉష్ణోగ్రత వద్ద అన్నాన్ని ఎక్కువ సేపు ఉంచితే అందులో బ్యాక్టీరియా ఎక్కువగా అభివృద్ధి చేసే ప్రమాదం ఉంది.


ఫుడ్ పాయిజనింగ్ అవుతుందా?


మిగిలిన ఆహారం తిన్న తర్వాత కొన్ని హానికరమైన బ్యాక్టీరియా, పరాన్నజీవులు, వైరస్ ల వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. ఇది చాలా మందిలో సర్వసాధారణంగా జరుగుతుంది. యునైటెడ్ స్టేట్స్ లో సుమారు 48 మిలియన్ల మంది పుడ్ పాయిజనింగ్ బారిన పడుతున్నారు. దీని వల్ల వాంతులు, విరోచనాలు, జ్వరం, కడుపులో నొప్పి ఎదురవుతాయి. ఫుడ్ పాయిజనింగ్ చాలా సందర్భాల్లో వారం లోపు వాటంతట పరిష్కారం అవుతాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళు, గరబహినూలు, ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు త్వరగా దీని బారిన పడతారు. ఇటువంటి వాటిని ఎదుర్కోవడానికి శరీరాలు సిద్ధంగా ఉండవు. కానీ కొన్ని సార్లు ఫుడ్ పాయిజనింగ్ మరణానికి కూడా కారణమవుతుంది. యునైటెడ్ స్టేట్స్ లో దాదాపు 3 వేల మంది మరణిస్తున్నారు.


వండిన అన్నంలోని కొన్ని బ్యాక్టీరియా ఉంటుంది. సరిగా నిల్వ చేయకపోతే అది ప్రమాదకరంగా మారుతుంది. సరిగా నిల్వ చేయని అన్నం తిన్న 1-5 గంటల తర్వాత వాంతులు, విరోచనాలు అవుతాయి. దీన్ని ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్ అంటారు. బాసిల్లస్ సెరియస్ ఇన్ఫెక్షన్ సాధారణంగా తేలికగా ఉంటుంది. కానీ ప్రమాదకరమైనది. ఇది కేవలం బియ్యానికి మాత్రమే వర్తించదు. ఏదైనా రైస్ సరిగా నిల్వ చేయకపోతే బ్యాక్టీరియా చెరిపోతుంది. సరిగ్గా వేడి చేయకపోతే అది తిన్న వ్యక్తి అనారోగ్యానికి గురవుతాడు.


 ఎలా నిల్వ చేయాలి?


బియ్యం 40 డిగ్రీల నుంచి 140 డిగ్రీల ఫారెన్ హీట్ మధ్య ఉష్ణోగ్రతలో రెండు గంటలకు పైగా ఉంటే బ్యాక్టీరియా చాలా త్వరగా పెరుగుతుంది. అంటే వండిన అన్నాన్ని గది ఉష్ణోగ్రత వద్ద రెండు గంటల కంటే ఎక్కువ ఉంచకూడదు. అన్నం రీహీట్ చేసుకుని గాలి చొరబడని కంటైనర్ లో పెట్టుకుని ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. 40 డిగ్రీల ఫారెన్ హీట్ కంటే తక్కువ ఉంచిన అన్నం ఫ్రిజ్ లో నాలుగు రోజుల వరకు ఉంటుంది. వండిన అన్నాన్ని మూడు నుంచి నాలుగు నెలల వరకు ఫ్రీజర్ లో సురక్షితమైన కంటైనర్ లేదా రీసీలబుల్ బ్యాగ్ లో నిల్వ చేసుకోవచ్చు. మిగిలిపోయిన అన్నం తినే ముందు దాన్ని సరైన పద్ధతిలో భద్రపరచడం అనేది ముఖ్యమైన విషయం. లేదంటే ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: ఈ కూరగాయలు రాత్రి వేళ తిన్నారో ఇక మీకు నిద్రకరువే